దర్శకుడిపై జూనియర్ ప్రశంసలు

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అమిగోస్ మూవీ ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బింబిసారా మూవీ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కథను నమ్మి సినిమాను దర్శకుడు రాజేందర్ రెడ్డి కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో సినిమా ఊహించిన దానికంటే చాలా బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని అంత అద్భుతంగా తీసిన దర్శకుడు రాజేంద్ర రెడ్డికి హీరో కళ్యాణ్ రామ్, అలాగే నిర్మాతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ అయితే దర్శకుడు రాజేంద్ర రెడ్డికి సినిమా పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు. అమిగోస్ మూవీ షూటింగ్ దశలోనే అతని తల్లి మృతి చెందారని, షూటింగ్ చివరి దశలో తండ్రి కూడా మరణించారని, అయినప్పటికీ ఇంటికి వెళ్లకుండా సినిమా కోసం తన పని చేస్తూ ఉండిపోయారని చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఏదైనా ఉద్యోగం చేయమని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ తను సినిమా దర్శకుడు కావాలనే ఆకాంక్షను తెలియజేశారని పేర్కొన్నారు. కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని తపన పడ్డారని తెలిపారు. తను సినిమా చేసిన తర్వాతే ఇంటికి తిరిగి వస్తానని చెప్పి దర్శకుడుగా మారెందుకు తన ప్రయత్నాలు చేశారని కొనియాడారు. ఈ క్రమంలో అమిగోస్ మూవీ కి దర్శకుడుగా ఛాన్స్ వచ్చిందని, ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి పనిచేసారని కొనియాడారు. ఈ సినిమా తప్పకుండా రాజేంద్ర రెడ్డి కోసం హిట్ అవ్వాలని, అతను తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నెరవేరాలని ఆకాంక్షించారు. కచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటువంటి దర్శకులు చాలా అవసరమని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడు రాజేంద్ర రెడ్డికి మరింతగా గుర్తింపు,పేరు ప్రఖ్యాతులు వస్తాయని అన్నారు. కచ్చితంగా అతను తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడు అవుతారని కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజేంద్రరెడ్డి పై ఉన్న తన అభిప్రాయాన్ని, అభిమానాన్ని అమిగోస్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో లక్షలాది అభిమానుల మధ్య వెల్లడి చేశారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More