బ్లాక్ హోల్ భూమి ని మింగేయబోతుందా..?

ఈ అనంత విశ్వంలో కంటికి కనిపించే ప్రతిదానికి ఆరంభం ఎలా ఉంటుందో అంతం కూడా అలాగే ఉంటుంది. గ్రహాలు మొదలుకొని నక్షత్రాల వరకు కూడా దీనికి ఏమి మినహాయింపు కాదు. అయితే దానికి కొంత సమయం అనేది ఉంటుంది. అయితే బ్లాక్ హోల్ వల్ల భూగ్రహానికి ముందు ముందు ముప్పు ఉందన్నది సైంటిస్టుల అభిప్రాయం. ఎంత పెద్ద గ్రహాలైన నక్షత్రమైన సరే బ్లాక్ హోల్ అనేది అమాంతం తనలో కలిపేసుకోగలదు. ఒక్కసారి ఈ బ్లాక్ హోల్ లోకి ఏదైనా సరే వెళ్లిందా తిరిగి వెనక్కి రావడం అంటూ ఉండదు. తన దరిదాపుల్లోకి వచ్చిన దేనినైనా సరే క్షణాల్లో మింగేస్తుంది. ఇది ఎంత శక్తివంతమైనది అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా తన వైపు తిప్పుకోగలదు. ఇదిలా ఉంటే ఇప్పుడు గ్రహాలకు బ్లాక్ హోల్ కంటే నక్షత్రాలు వల్లే మరింత ప్రమాదం ఉందన్నది సైంటిస్టులు చెబుతున్నారు. నక్షత్రాలు కూడా గ్రహాలను అమాంతంగా మింగేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఓ నక్షత్రం ఓ చిన్న గ్రహాన్ని మింగేయడం గుర్తించిన సైంటిస్టులు భవిష్యత్తులో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నది స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనతో ఇప్పుడు గ్రహాలకు కూడా మరణం ఉంటుందా అనే దాని పై పరిశోధన చేస్తున్నారు. అదే సమయంలో భూమికి కూడా అలాగే జరగబోతోందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. భూమికి కూడా అలాంటి అంతం ఒకటి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే 500 కోట్ల సంవత్సరాల వరకు అలా జరిగే అవకాశం లేదని, సూర్యుడు కూడా మండిపోతూ సౌరవ్యవస్థలోని గ్రహాలను మింగేస్తాడని అంచనా వేస్తున్నారు. ఇటీవల భూమి నుంచి సుమారు 12 వేల కాంతి సంవత్సరాల దూరంలో, అక్విలా నక్షత్ర రాశికి సమీపంలోని పాలపుంతలో నక్షత్రం గ్రహాన్ని మింగేసిన ఘటన సంభవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వంలో ఇంతకుముందెన్నడూ ప్రత్యక్షంగా చూడలేని ఒక ఖగోళ అద్భుతాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా ఒక గ్రహం మరణాన్ని వారు గుర్తించగలిగారు. విశ్వంలో జరిగిన ఈ పరిణామాన్ని ఖగోళ విషయాలపై అధ్యయనం చేస్తున్న ఈ బృందం అనూహ్యంగా గుర్తించింది. ఒక నక్షత్రం కేవలం పది రోజుల్లో సాధారణ స్థాయి కంటే వంద రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా వెలిగిపోతుండడాన్ని ఈ బృందం తొలుత గుర్తించింది. నక్షత్రం మింగేయడంతో విశ్వం నుంచి కనుమరుగైన ఆ గ్రహం దాదాపు గురుగ్రహం అంత పెద్దగా ఉంది. ఉపరితలంపై వాయువులతో నిండిపోయి ఉందని గుర్తించారు. నక్షత్రానికి దగ్గరగా ఉన్న ఆ గ్రహం ఒక్క రోజులోనే ఒక కక్ష్యను పూర్తి చేసిందని పరిశోధకుల బృందం గుర్తించింది. గ్రహాన్ని తనలో కలిపేసుకున్న ఆ నక్షత్రం పోలికలో సూర్యడికి దగ్గరగా ఉందని, సుమారు వంద రోజుల వ్యవధిలో ఆ నక్షత్రం గ్రహాన్ని మింగేసినట్లు గుర్తించారు. నక్షత్రంలో గ్రహం విలీనమయ్యే ముందు భారీగా దుమ్ము వ్యాపించడాన్ని గమనించారు. చివరి పది రోజుల్లో గ్రహం పూర్తిగా నక్షత్రంలో కలిసిపోయే క్రమంలో భారీ పేలుడు సంభవించినట్టుగా ప్రకాశవంతంగా కనిపించడాన్ని పరిశోధక బృందం గుర్తించింది. గ్రహాలను నక్షత్రాలు తమలో కలిపేసుకోవడం లాంటి ఘటనలు గతంలో జరిగినా, ఎప్పుడూ వాటిని ప్రత్యక్షంగా గుర్తించలేకపోయారు. అంటే, ఒక గ్రహం నక్షత్రంలో కలిసిపోయిన తర్వాత, లేదంటే కలిసిపోక ముందు మాత్రమే గమనించగలిగారు. కానీ ఈసారి నక్షత్రం గ్రహాన్ని మింగేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడే గుర్తించగలిగారు. ఒక నక్షత్రం తన శక్తిని కోల్పోయినప్పుడు, తన చుట్టూ తిరుగుతున్న గ్రహాలు అందులో కలిసిపోతాయి. దీనినే గ్రహాన్ని నక్షత్రం మింగేయడంగా చెబుతున్నారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More