‘గబ్బర్‌ సింగ్‌’ ఒక చరిత్ర నిర్మాత బండ్ల గణేష్

గబ్బర్‌ సింగ్‌’ మా జీవితాలను మార్చేసింది.

గబ్బర్ సింగ్ ఒక చరిత్ర. రీ రిలీజ్ కి ఇంత క్రేజ్ ఏంటని కొందరు అడుగుతున్నారు. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎంత పవిత్రమైనదో పవన్ కళ్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ అంత పవిత్రమైనదని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు..
12ఏళ్ల క్రితం సినిమా రిలీజైన ఈ చిత్రం రీ రిలీజ్ అవుతుంటే అభిమానులు సందడి మాత్రం ఈ రోజే రిలీజై రిజల్ట్ వచ్చిన ఆనందం లా వుంది 12 ఏళ్లకి పుష్కరాలు వస్తాయి. రెండో తారీకు నుంచి థియేటర్స్ కి పుష్కరాలు రాబోతున్నాయి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న ‘గబ్బర్ సింగ్‌’ రీరిలీజ్‌ కానున్న నేపథ్యంలో రీ-రిలీజ్ ప్రెస్ మీట్ జరిగింది. నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు బ్రతుకుని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నాకు ఈ క్రేజ్, పేరు ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ ఒక రోజు పిలిచి సినిమా నిర్మించే అవకాశం ఇచ్చారు. నన్ను నేను నమ్ములేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ‘గణేష్ కి మాటిచ్చాను. తనతో సినిమా చేస్తానని’ నన్ను నిర్మాతగా నిలనెట్టారు. ఈ సందర్భంగా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గబ్బర్ సింగ్ సినిమాని అణువణువునా ప్రతి అడుగు ప్రతి మాట ప్రతిక్షణం ప్రతి కష్టం డైరెక్టర్ హరీష్ శంకర్ కి చెందుతుంది. హరీష్ శంకర్ ఏది చెప్తే అది చేద్దాం అని పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రారంభమైన రోజునే చెప్పారు.. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఆయన గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి. నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి. భారతదేశంలో ఏ నటుడు పొందలేనంత అత్యధిక రేమ్యునిరేష్ పొందగలిగే స్టార్ అయినప్పటికీ హాయిగా బ్రతికే కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ అన్నీ వదిలేసి జనం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. దాదాపు 10ఏళ్లు ప్రజల కోసం పోరాడి ఈ రోజు ఒక స్థాయికి వచ్చారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం వున్న పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ సినిమా తీయడం నా అదృష్టం. కళ్యాణ్ బాబు షూటింగ్ లో గుర్రం మీద నుంచి పడ బోయారు. అప్పుడు పెద్ద ప్రమాదం తప్పింది. నేను షాక్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ ఏం చెబితే అది చేశారు. చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు, అభిమానులు సినిమాకి బ్రహ్మరధం పట్టారు. విందుభోజనం లాంటి ఈ సినిమా మరోసారి విడుదల చేయడం నా అదృష్టం. రీరిలీజ్ లో కూడా టికెట్లు దొరకడం లేదు. అంత క్రేజ్ వుంది. ఏడేళ్ళుగా నేను సినిమా తీయకపోవడం బాధగా వుంది. మళ్ళీ సినిమాలు తీస్తా. సినిమానే నా వ్యాపకం, నా జీవితం. బ్లాక్ బస్టర్స్ తీస్తా. గబ్బర్ సింగ్ రీరిలీజ్ లో వచ్చే కలెక్షన్స్ అదిరిపోవాలి. సెప్టెంబర్ 2 న ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని ఉదయం గుడికి వెళ్తాడు. తర్వాత థియేటర్స్ కి వెళ్తాడు ఇది కన్ఫర్మ్. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఎగ్జిబిటర్ కి నా విన్నపం. థియేటర్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా క్రమశిక్షణగా వుంటారు. మా వాళ్ళు థియేటర్స్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించరని పవన్ కళ్యాణ్ భక్తుడిగా మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేడు ఉపముఖ్యమంత్రి. ఆయన అభిమానులమైన మేము ఎంతో క్రమశిక్షణగా మెలుగుతాం. గబ్బర్ సింగ్ సినిమా చూస్తే మాకు దైవదర్శనం. కాబట్టి మా దైవదర్సనానికి ఆటంకం కలిగించవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం’అన్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి గణేశ్‌ హీరో. అందుకే ఆయన్ని చివరిగా మాట్లాడమని చెప్పా. సోషల్‌మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈరోజుల్లో ‘గబ్బర్‌సింగ్‌’ రిలీజ్‌ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో ఎప్పటినుంచో ఒక చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. ‘గబ్బర్‌ సింగ్‌’ అంటేనే ఒక చరిత్ర. మా జీవితాలను మార్చేసిన చిత్రమిది. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు అభిమానాన్ని చూపించారు. ఇదంతా పవన్ కళ్యాణ్ గారిదే అని నమ్ముతూవచ్చాను. ఈ సక్సెస్‌ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి బండ్ల గణేశ్‌. ఆయన ఎప్పుడూ బ్లాక్ బస్టర్ కొడుతున్నామని గట్టి సంకల్పంతో వుండేవారు. సెట్ బయట బయట నా కంటే డబుల్ కష్టపడ్డారు. కెమరామెన్ విన్సెంట్ గారు చాలా సపోర్ట్ చేశారు. దేవిశ్రీ పాటలకు థియేటర్ ఊగిపోయింది. పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకి వస్తాయి. గబ్బర్ సింగ్ సినిమా అంతే ఎవర్ గ్రీన్. ఈ సినిమా సక్సెస్‌ ఊహించిన తొలి వ్యక్తి పవన్‌కల్యాణ్‌ గారు. డబ్బింగ్‌ సమయంలోనే ఆయన ఇది పక్కా బ్లాక్‌బస్టర్‌ అన్నారు. నా ఫ్యాన్స్ కురుకునేది ఇవ్వబోతున్నావ్. ఈ సినిమా నివ్వుఊహించే సక్సెస్ అవుతుంది. సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా వుండని చెప్పారు. ఇది పక్కా బ్లాక్ బస్టర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. సినిమా విడుదలైన నాలుగు రోజుల తర్వాత కలిసినప్పుడు ఫ్యాన్స్ హ్యాపీగా వున్నారా అని అడిగారే తప్పితే కలెక్షన్స్ కి గురించి మాట్లాడలేదు. ఒకప్పుడు ఆయన అటోగ్రాఫ్ కి అభిమాని ఆనందించేవాడు. ఇప్పుడు ఆయన సంతకానికి ఒక పవర్ వుంది, ఆ పవర్ కొన్ని జీవితాల్ని మార్చబోతోందన్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More