తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా సీనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతారు. సెట్ లో ఉన్నప్పుడు దర్శక నిర్మాతలకు, తోటి నటీ నటుల పట్ల వ్యవహరించే తీరే ఆయనకు మరింత గౌరవ భావాన్ని పెంచింది. 70వ దశకం తర్వాత ఆయనను అందరూ పెద్దాయన అని పిలవడం మొదలుపెట్టారు. 80వ దశకం తర్వాత ఆయన స్థాయి మరింతగా పెరిగింది. వయసు మళ్లిన తర్వాత కూడా సూపర్ హిట్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేశారు. రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా తన పద్ధతులు మార్చుకోలేదు. ఆయన వద్ద క్రమశిక్షణ పాటించకపోతే అవతల వారిని మందలించే విషయంలో ఏమాత్రం వెనుకాడేవారు కాదు. అదే బయటి వారైనా సరే తన కుటుంబ సభ్యులైన సరే. క్రమశిక్షణతో నడుచుకోవాలని, ఎదుటివారిని నొప్పించకుండా మసలుకోవాలని ఆయన హితవు చెబుతూ ఉండేవారు. ఆయన నటి వారసుడు నందమూరి బాలకృష్ణ ని కూడా ఒకానొక సందర్భంలో ఈ విషయం మీదే మందలించారు. సున్నితంగా చెబుతూ బాలకృష్ణని కూడా ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిలా చేశారు. ఆదిత్య-369 షూటింగ్ సమయంలోనే జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ ఆ సినిమా దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తరచుగా మీడియా ఇంటర్వ్యూలలో చెబుతూనే ఉంటారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఆదిత్య-369 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న రోజులలో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి మరింతగా పెరిగింది. దీనికి కారణం టైం మిషన్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీయడమే. భవిష్యత్తు కాలానికి సంబంధించి సీన్లు షూటింగ్ చేస్తున్న సమయంలో దర్శకుల సింగీతం శ్రీనివాసరావు బాలకృష్ణ కాంబినేషన్లో కొన్ని ట్రిక్ ఫోటోగ్రఫీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆయన షాట్ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. ఉదయం 11 తర్వాత షూటింగ్ రావాలని దర్శకులు చెప్పడంతో ఉదయాన్నే షూటింగ్ స్పాట్ కు వచ్చిన బాలకృష్ణ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు ఆ టైం కి రావచ్చని. షూటింగ్ కు వెళ్లకుండా ఇంకా ఇంట్లో ఉన్నావెంటని ఎన్టీఆర్ బాలకృష్ణ ను అడగడంతో దర్శకులు చెప్పిన విషయాన్ని తండ్రికి చెప్పాడు బాలకృష్ణ. సెట్ లో నీ కాంబినేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడూ నీ అవసరం ఉంటుందో అనేది అనవసరం. ఆరోజు నీ షూటింగ్ ఉందంటే ముందుగానే అక్కడికి వెళ్లి ఉండటం శ్రేయస్కరం. అది పద్ధతి, క్రమశిక్షణ. అక్కడికి వెళ్లిన తర్వాత దర్శకుడు ఏమి చెబితే అదే చేయడం నటులుగా మన బాధ్యత. ఇంకెప్పుడు ఇలా చేయవద్దు. నీకు అక్కడ అసౌకర్యంగా ఉంటుందని చెప్పి షూటింగ్ కి కొంచెం లేటుగా రమ్మని చెప్పారు. పని దైవంగా భావించే వాళ్ళు తమ సౌకర్యం కోసం ఎప్పుడూ ఆలోచించరు. మనల్ని నమ్మి సినిమా చేసే వాళ్లకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే సీనియర్ ఎన్టీఆర్ కాస్త మందలిస్తూ సున్నితంగానే చెప్పారు. మరుసటి రోజు షూటింగ్ స్పాట్ కి బాలకృష్ణ ఉదయాన్నే 9 గంటలకు రావడం చూసి దర్శకులు శ్రీనివాసరావు అవాక్కయ్యారు. మిమ్మల్ని ఉదయం 11 తర్వాత మీరు చాలా త్వరగా వచ్చారని గుర్తు చేశారు. మీరు చెప్పిన విషయమే నేను కూడా చెప్పి చూశాను. కానీ మా తండ్రిగారు అందుకు ఒప్పుకోలేదు. క్రమశిక్షణ పాటించాలంటూ నచ్చ చెప్పారు. ఇక ఆయన చెప్పాక ఆయన మాట నేను జవదాటడం బాగోదు. ఆయన చెప్పింది కూడా మంచిదే కదా, అందుకే షూటింగ్ కి త్వరగా రాక తప్పలేదు చెప్పాడు బాలకృష్ణ. క్రమశిక్షణ అంటే ఎన్టీఆర్ అని ఎందుకు అంటారు ఆరోజు జరిగిన సంఘటన గురించి పలు సందర్భాలలో దర్శకులు శ్రీనివాసరావు చెబుతూనే ఉన్నారు. అలాగే బాలకృష్ణ కూడా నేటి వరకు కూడా తన తండ్రిలాగే క్రమశిక్షణ పాటిస్తూ దర్శక నిర్మాతలకు ఎప్పుడు కూడా తన వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పటి తరం నటులు దీనిని ఆచరణలోకి తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని వందల కోట్లను ఆదా చేస్తుంది.