పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని సర్వే సంస్థలు అంచనా వేయడంతో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ పెరిగింది పవన్ ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగామార్చుకుంటానంటూ గతంలో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పేరు మార్చుకునేందుకుసిద్ధంగా ఉండాలంటూ జనసైనికులు ఇంత వరకు పోస్టులు పెట్టారు… అయితే 99శాతం ఎగ్జిట్ పోల్స్ అన్నీ(వైసీపీ అధికారం లోకి వస్తుంది అన్న ఆరా మస్తాన్ సర్వే తో సహా) పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో గెలుపొందనున్నారని వెల్లడి చెయ్యడం తో జనసైనికుల్లో ఉత్సాహం మరింత పెరిగింది ఫలితాల అనంతరం మేళతాళాలతో పురహితులతో కలసి నామకరణ మహోత్సవానికి వెళ్లాలని సమాయత్తమవుతున్నారని సమాచారం.’పెద్దాయన పేరు మరికొన్ని గంటల్లో శాస్త్రోక్తంగా పద్మనాభ రెడ్డిగా మారబోతుంది’ అంటూ హల్చల్ చేస్తున్నారు.. నిన్నటి నిన్న స్టిక్కర్ల వార్ ని ఫుల్ వైరల్ చేసిన జనసైనిక్స్ ముద్రగడ పేరు మార్పుని ప్రెస్టీజియస్ గానే తీసుకున్నారు.. అయితే ఊరేగింపులు, ప్రదర్శనలపై ఎన్నికల కమిషన్ నిషేధం ఉండడం తో సైనికులు ఎం చేయనున్నారో చూడాలి.. ఏదీ ఏమైనా నామకరణం ఘనంగా జరగాల్సిందే నని పట్టుబట్టారు..