ఎ.పి లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నది.. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అన్న సస్పెన్స్ కొనసాగుతుండగా ప్రస్తుత మంత్రుల హోదా మాత్రం జూన్3 తో శుభం కార్డ్ పడనుంది.. ఆరోజు వాళ్ళ ఛాంబర్స్ కి వాళ్ళకి ఋణం తీరిపోబోతుంది.. ఈ మేరకు మంత్రుల చాంబర్లు, సహాయకులను అప్పగించాలని సాదారణ పరిపాలనా శాఖ (GAD) ఆదేశాలు జారీ చేసింది..మంత్రుల ఛాంబర్ల నుండి ఎటువంటి పైల్స్, ఇతర సామాగ్రి తరలించటం పై నిషేదం విధించినట్లు సాదారణ పరిపాలనా శాఖ అధికారులు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు..సచివాలయం లో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, స్టేషనరీ ఫైల్స్, వస్తువులు తీసుకెళ్లారాదని తెలిపింది.. అలాగే వాహన తనిఖీలు నిర్వహించాలని ఈ మేరకు సచివాలయం సెక్యూరిటీ చూసే ఎస్పీఎఫ్(SPF) కు ఆదేశించింది..