వేసవి సెలవులు.. వీకెండ్ హాలీడేస్.. పెళ్లిళ్లు.. పేరంటాలకు.. ఇల్లొదిలి ఊరెళ్తున్నవారికి పోలీసులు భరోసా ఇస్తున్నారు. ‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ (లాక్డ్ హౌస్ మానటిరింగ్ సిస్టం) ద్వారా దొంగల ఆట కట్టించొచ్చని సూచిస్తున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరా కలిగి దొంగలు ఇంట్లోకి ప్రవేశించడాన్ని రికార్డ్ చేసి దానిని ఇంటి యజమానికి పోలీసులకు పంపుతుంది. చిత్రం అందిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు రంగంలోకి దిగి చొరబాటుదారులను అదుపులోకి తీసుకుంటారు. ఏపీ పోలీసులు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇతర విభాగాలను కూడా కవర్ చేస్తుంది.స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఎల్‌హెచ్‌ఎంఎస్(LHMS) ఏపీ పోలీస్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని వారి పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలను నమోదు చేసుకోవాలి. నివాసితులు తమ ఇంటి నుండి మాత్రమే యాప్ ని రిజిస్ట్రర్ చేసుకోవాలి, దానివలన పోలీసులు లొకేషన్ ని ఈజీ గా ఐడెంటిఫై చెయ్యగలరు దీనికి సంబంధించి ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.. ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.అభ్యర్థించిన 24 గంటల్లో, పోలీసులు ఇంటికి చేరుకుని కెమెరాను ఫిక్స్ చేస్తారు. ఇంట్లోవాళ్ళు ఎప్పటినుండి ఎప్పటి వరకు వుండరో ఆ వివరాలనుఅందించాలి..యాప్‌కు కనెక్ట్ చేయబడిన కెమెరా ఇంటి యజమాని లేనప్పుడు ఎవరైనా చొరబాటుదారుడు క్లిక్ చేస్తుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఎవరైనా సదుపాయాన్ని పొందవచ్చని చెప్తున్నారు.. సీసీ కెమెరాను పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానించడం ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారని, సంబంధిత ఇళ్లలో అనుమానాస్పద వక్తులు ప్రవేశిస్తే కంట్రోల్ రూంలో అలారం కూడా మోగుతుందని తద్వారా దొంగల్ని పట్టుకునే అవకాశముందని అదే విధంగా నగర ప్రజలు కూడా సీసీ కెమెరాల్ని అన్ని చోట్లా అమర్చుకుంటే నేరాల్ని అరికట్టవచ్చని పోలీసు శాఖ చెపుతోంది.