మనదేశం లో ఏక్టివ్ గా ఉన్న ఒకే ఒక అగ్నిపర్వతం

భారత దేశంలో అక్టీవ్ గా ఉన్న ఒకే ఒక అగ్నిపర్వతం ప్రకృతి అందాలతో కనువిందు చేసే అండమాన్ దీవులను ఆనుకొని ఉంది. దీని పేరు బ్యారెన్ ఐల్యాండ్ అండమాన్‌‌‌‌ నికోబార్‌‌‌‌ దీవుల రాజధాని పోర్ట్‌‌‌‌బ్లెయిర్‌‌‌‌కు ఈశాన్యంగా 135 కిలో మీటర్ల దూరంలో ఉన్న బ్యారెన్‌‌‌‌ దీవి మొట్టమొదటి విస్ఫోటనం 1787 లో జరిగింది.అప్పటి నుండి ఈ అగ్నిపర్వతం పది సార్లు కంటే ఎక్కువ సార్లు విస్ఫోటనం చెందింది.. దాదాపు ఒకటిన్నర శతాబ్దపు నిద్రాణస్థితి తర్వాత,1991లో సంభవించిన విస్ఫోటన ప్రభావం ఆరు నెలల పాటు ఉంది. ఇక్కడ వుండే జంతుజాలానికి తీవ్ర హాని కలుగజేసింది.. జంతువులపై వాతావరణం పై ఈ పేలుడు చూపించిన ప్రభావాన్ని అంచనా వేయడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం 1993లో బారెన్ ద్వీపాన్ని సందర్శించి నివేదిక రూపొందించింది.. విస్ఫోటనం కారణంగా పక్షి జాతుల సంఖ్య విపరీతంగా తగ్గిందని పేర్కొంది. అలాగే ద్వీపంలో మనుగడ లో ఉన్న 16పక్షి జాతుల్లో ఆరు పక్షి జాతుల్ని మాత్రమే ఈ పరిశోధన బృందం గుర్తించింది. అలాగే రాటస్ రాటస్ అనే ఎలుక జాతి ని 51 రకాల కీటకాలను మాత్రమే గుర్తించింది. బృందం పర్యటన సమయంలో కూడా అగ్నిపర్వతం వాయువును విడుదల చేస్తూనే ఉందని నివేదిక లో పేర్కొన్నారు.. 1994-95 లోను, 2005-07లోను అగ్నిపర్వతం పేలుడు జరిగింది. తరువాత అనేకసార్లు పేలుడు సంభవించినప్పటికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కి చెందిన బృందం 2017లో అగ్నిపర్వతం పేలడాన్ని గుర్తించింది. పగటిపూట బూడిద మేఘాలు మాత్రమే ఉంటాయి. అయితే, సూర్యాస్తమయం తర్వాత, ఎర్రటి లావా ఫౌంటైన్‌లు బిలం నుండి వాతావరణంలోకి చిమ్ముతున్నాయి మరియు వేడి లావా దాని వాలులపై ప్రవహిస్తుంది. ఆ బృందం వివరించింది.కార్బన్ డేటింగ్ ఆధారంగా బారెన్ ద్వీపం నుండి, అగ్నిపర్వతం యొక్క అతి పురాతనమైన సబ్‌ఏరియల్ లావా ప్రవాహాలు 1.6 మిలియన్ సంవత్సరాల నాటివని మరియు అగ్నిపర్వతం దాదాపు 106 మిలియన్ సంవత్సరాల పురాతనమైంది .బారెన్ ద్వీపం చుట్టుపక్కల ఉన్న జలాలు ప్రపంచంలోని అతి పెద్ద స్కూబా డైవింగ్ పాయింట్స్ లో ఒకటిగా గుర్తింపు పొందాయి.. బ్యారెన్‌‌‌‌ అంటే ‘విడిచి పెట్టిన’ అని అర్థం . ఈ దీవిలో ఎప్పుడు? ఎక్కడ నుంచి లావా ఎగుస్తుందో గుర్తించలేం. గంధకం వాయువు ఉండటం వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా ఇక్కడ కష్టం. చెట్లు, పుట్టలు మాడిపోయి దీవంతా బూడిద రంగులో కనిపిస్తుంది . ఆదిమ తెగలే కాకుండా జీవజాలం కూడా లేకపోవడంతో ఈ దీవికి బ్యారెన్‌‌‌‌ అనే పేరు వచ్చింది . బ్యారెన్‌‌‌‌ ద్వీపం భారత్‌-బర్మన్‌‌‌‌ టెక్టోనిక్‌ ఫలకంపై అగ్ని పర్వత బెల్ట్‌‌‌‌ మధ్య ఏర్పడింది. గతంలో కొన్ని రకాల వన్య ప్రాణులు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో అరుదైన అడవి మేక జాతి పెరెల్‌‌‌‌ ఒకటి. వాటిని ఎన్నో ఏళ్ల క్రితం నౌకా ప్రయాణాల్లో భాగంగా కొందరు నావికులు ఇక్కడ వదిలారనే ప్రచారం ఉంది. అప్పటి నుంచి పెరెల్‌‌‌‌ జాతి మేకలు సముద్రపు నీటిని తాగి ఇక్కడ జీవనానికి అలవాటు పడ్డాయి. ఈ దీవుల్లో కొన్ని రకాల పక్షులతో పాటు గబ్బిలాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఇక్కడ ఎక్కువగా జరిగే విస్ఫోటనాలతో అరుదైన వన్యప్రాణులతో పాటు వందలాది సముద్ర జీవులు కనుమరుగవుతున్నాయి

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More