ఆంద్రప్రదేశ్, బాపట్ల జిల్లా వాసి అమెరికాలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజరి గ్రామానికి చెందిన గోపికృష్ణ ఉన్నత చదువులు(ఎంఎస్) నిమిత్తం అమెరికా వెళ్ళాడు. ఆదివారం గుర్తు తెలియని 16 ఏళ్ల దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ 32 ఏళ్ళ గోపికృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. డల్లాస్ లోని ఒక సూపర్ మార్కెట్ లో క్యాష్ టెల్లర్ గా విధులు నిర్వస్తున్న గోపికృష్ణ పై దుండగుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. కొనుగోలుదారుడిగా వచ్చిన దుండగుడు నేరుగా పాయింట్ బ్లాక్ లో కాల్పులు జరిపి సిగరెట్ ప్యాకెట్ తీసుకుని వెళ్లినట్టు సిసి కెమెరాలు ద్వారా తెలుస్తోంది. ఉన్నత చదువులు నిమిత్తం అమెరికా వెళ్లిన కుమారుడు విగత జీవి కావడం గోపి కృష్ణ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. నిందితుణ్ణి అమెరికా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు గోపీకృష్ణకి భార్య, కుమారుడు ఉన్నారు. దీంతో గోపీకృష్ణ స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలముకున్నాయి.