సన్నీ డియోల్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబో లో ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయిన #SDGM షూటింగ్ ఈరోజు అఫీషియల్ గా ప్రారంభమైంది. కంట్రీస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న #SDGM ఇండియన్ సినిమాలో యాక్షన్ స్టయిల్ ని రీడిఫైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. మూవీ నెరేటివ్ లో కీలకంగా వుండే కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం ద్వారా మూవీ యూనిట్ మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ సన్నివేశాలు, పక్కాగా ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి, ప్రేక్షకులు ఆశించే హై-ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాని ప్రజెంట్ చేస్తూ సినిమాకి టోన్ సెట్ చేస్తాయి.
సన్నీ డియోల్ తన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టడంలో పాపులర్. బలమైన భావోద్వేగ కథనాలతో ఇంటెన్స్ యాక్షన్‌ను అద్భుతంగా బ్లెండ్ చేయగల డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జట్టుకట్టారు. ఈ కొలాబరేషన్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. జా-డ్రాపింగ్‌గా కొరియోగ్రఫీ చేసిన స్టంట్స్‌తో ఈ మూవీ జానర్‌లో న్యూ స్టాండర్ద్స్ సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది. లార్జర్ దెన్ లైఫ్ గా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు మొదటి నుండి చివరి వరకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించనున్నాయి. సయామి ఖేర్, రెజీనా కసాండ్రా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. సెన్సేషనల్ కంపోజర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ కాగా, నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్‌ను నిర్వహిస్తున్నారు.