60 ఇయర్స్ సక్సెస్ ఫుల్ లెగసీ సురేష్ ప్రొడక్షన్స్, రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాతో వస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రైటర్, డైరెక్టర్. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ మూవీకి “35 – చిన్న కథ కాదు” అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ప్లజెంట్ గా డిజైన్ చేసిన పోస్టర్ ద్వారా మేకర్స్ టైటిల్ ని రివిల్ చేశారు. గుడి మెట్లపై కూర్చున్న ఫ్యామిలీని ప్రజెంట్ చేస్తూ క్యారికేచర్‌గా దీన్ని రూపొందించారు. థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆకాశం నీ హద్దు రా, అంటే సుందరానికి, సర్ఫీరా, కుబేర తదితర చిత్రాలకు గ్రేట్ విజువల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న నికేత్ బొమ్మి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.