విశ్వ రహస్యాల్ని ఛేదించేందుకు.. రష్యా ఓ ప్రాజెక్టు చేపట్టింది. అదే టెలీపోర్టేషన్. మనుషుల్ని కాంతి రూపంలోకి మార్చుతారు. మనిషిలోని అణువులన్నింటినీ వేరు చేసి.. వాటిని విశ్వంలోని మరో ప్రాంతానికి చేరుస్తారు. అక్కడ తిరిగి ఆ అణువులన్నీ కలిసి మానవ రూపం ఏర్పడుతుంది. నిజానికి ఇదో ప్రమాదకర ప్రాజెక్టు. టెలీపోర్టేషన్‌లో సమాచారాన్ని చేరవేస్తే తప్పులేదు గానీ.. మనుషుల్ని తీసుకెళ్లాలనుకోవడం తప్పంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఈ ప్రాసెస్‌లో ఏ చిన్న తేడా వచ్చినా.. ప్రాణం పోయినట్లే. అణువులన్నీ తిరిగి మనిషిలా మారినా.. ప్రాణం తిరిగొస్తుందన్న గ్యారెంటీ లేదు. కానీ, టైమ్ మెషీన్ మన దగ్గరుంటే కరోనా వైరస్ అంతుచూసే వాళ్లమేమో. లేదా భవిష్యత్తులోకి ప్రయాణించి వ్యాక్సిన్ గురించి చెప్పేవాళ్లమేమో. మొత్తానికి టైమ్ ట్రావెల్‌పై చాలా సిద్ధాంతాలున్నా.. ఒక్కటీ నిజమయ్యేలా లేవు. కాంతి వేగాన్ని అందుకోవడమే అసలు సమస్య. సో.. టైమ్ ట్రావెల్ అనేది ఓ పాజిటివ్ ఐడియా మాత్రమే. అది సాధ్యమా, కాదా అన్నది ఇప్పుడే చెప్పలేం. పరిశోధనలు, ప్రయోగాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.