విశాఖ నుంచి చెన్నై కి లాహిరి.. లాహిరి.. లాహిరిలో ….

విశాఖ నగరవాసుల్ని ఎంతో కాలంగా ఊరిస్తున్న విహారనౌకల సదుపాయం అందుబాటులోకి రానుంది. ‘ఎంప్రెస్‌’ అనే పేరుగల నౌక విశాఖ టూ చెన్నై వయా పాండిచ్చేరి కి తన ప్రయాణాలను ప్రారంభించబోతుంది.. దానిలో ప్రయాణించాలనుకునే వారు వారి వారి ఇష్టాన్ని బట్టి వివిధ క్లాసులలో హాపీ గా జర్నీ చేయవచ్చు. ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ రూం, ఓషన్‌ వ్యూ స్టాండర్డ్‌ రూం, మినీ సూట్‌ రూం, సూట్‌ రూం పేరిట ఇందులో నాలుగు కేటగిరీలు వున్నాయి.ఒక్కో విభాగానికి ఒక్కో రేటు ను నిర్ణయించారు. సుమారు 1500 నుంచి 1800 మంది వరకు ప్రయాణించే వీలున్న ఈ క్రూయిజ్ కి ప్రస్తుతం విశాఖ నుంచి చెన్నై వరకు వెళ్లేందుకు టిక్కెట్లు విక్రయిస్తున్నారు. మొదటి సర్వీసు జూన్‌ 8న ఉదయం ప్రయాణికులతో రానుంది. అందులోని ప్రయాణికులు విశాఖలో సాయంత్రం వరకు విహరిస్తారు. తిరిగి విశాఖ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి తొమ్మిదో తేదీ మొత్తం సముద్రంలోనే ప్రయాణిస్తుంది. 10వ తేదీ ఉదయం ఏడు గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. పుదుచ్చేరిలో రాత్రి ఏడుగంటల వరకు సైట్ సీయింగ్ కు ఏర్పాట్లు కూడా సంస్థే చేస్తుంది. పుదుచ్చేరిలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు (నాలుగో రోజుకు) చెన్నైకు చేరుకుంటుంది. ఎంప్రెస్‌ విదేశీ విహార నౌక అయినప్పటికీ దీన్ని ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు. దీంతో పాస్‌పోర్ట్‌ అవసరం లేదు.కస్టమ్స్‌ తనిఖీలు ఉండవు అలాగే క్రూయిజ్ లో అబ్బురపరచే పలు వసతులున్నాయి. ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్, ఫిట్‌నెస్‌ సెంటర్ తదితర సౌకర్యాలున్నాయి. ఉదయం వేళల్లో పలు కార్యక్రమాలను వీక్షించే సదుపాయం ఉంది. కాసినోను చూడడానికి అనుమతిస్తారు. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనకు నచ్చిన ఫుడ్ తినడానికి కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. మద్యం, స్పా సర్వీసులు, కాసినోలకు క్రీడలకు డబ్బులు చెల్లించాలి. విశాఖ నౌకాశ్రయానికి గతంలో కూడా కొన్ని నౌకలు వచ్చినా ప్రస్తుతం వచ్చే ‘ఎంప్రెస్’ కు చాలా ప్రత్యేకతలున్నాయంటున్నారు. తిరిగి జూన్‌ 15న, 22వ తేదీన మళ్ళీ రానున్న ఈ అతిపెద్ద క్రూయిజ్‌ విశాఖ నౌకాశ్రయంలోకి రావటానికి అన్ని అనుమతులు ఇచ్చామని, ఇతరశాఖల అధికారులకు కూడా సమాచారం తెలియజేశామని పోర్టు అధికారులు చెప్పారు. భారత సాగరతీరాల్లో మాత్రమే తిరిగే విహార నౌక కావడంతో అందులోని పర్యాటకులలో దాదాపు అందరూ భారతీయులే ఉంటారని పేర్కొన్నారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More