జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో ప్రదర్శించిన జల్సా మూవీ ప్రదర్శన సమయంలో జరిగిన దురదృష్టకర సంఘటనల పై సర్వత్ర విమర్శలు వెలువెత్తాయి. కొన్నిచోట థియేటర్ల అద్దాలు పగలగొట్టడం అలాగే కుర్చీలను విరగొట్టడం, స్క్రీన్ లను చింపేయడం, థియేటర్లలో ఫైర్ ఆన్ చేయడం వంటి చర్యలు జనసేన పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ఇటువంటి ఘటనలను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయరు. మంచి పనులు చేస్తూ నలుగురికి బాసటగా నిలబడి , స్ఫూర్తిదాయకంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు అభిమానులను కోరుతూ ఉంటారు. టాలీవుడ్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక వేరే లెవెల్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందనే విషయాన్ని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఎప్పుడు జనంతో ఉంటూ వారి సాధక బాధకాలను తెలుసుకుంటూ వారితోనే గడుపుతున్న పవన్ కళ్యాణ్ పట్ల చాలా మంది అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. ఈ సమయంలో జల్సా మూవీ ప్రదర్శన సమయాలలో అభిమానులు థియేటర్లలో చేసిన పని పట్ల ఆయన ఒకింత విచారాన్ని వ్యక్తం చేసినట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్నది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే అధికార పార్టీ వైసిపి – జనసేన పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ నడిచింది. పవన్ కళ్యాణ్ అభిమానులను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ పలు కామెంట్లు చేయడంతో పాటు ధ్వంసమైన థియేటర్ల ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ చేశారు. జనసేన పార్టీ పూర్తి బాధ్యత వహించి ఆ ధియేటర్ ల నష్టాన్ని భర్తీ చేయాలన్న డిమాండ్ కూడా చేశారు. అభిమానుల ముసుగులో వైసిపికి చెందినవారే థియేటర్లలో అల్లర్లు సృష్టించి , ఆ థియేటర్ల ధ్వంసానికి కారణమయ్యారని మరో పక్క జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా విశాఖలోని లీలామహర్ థియేటర్ ధ్వంసం పైనే పెద్ద చర్చ మొదలయ్యింది. అభిమానులు చేసిన పనికి 20 లక్షల మేర నష్టం వాటిలినట్లు థియేటర్ యాజమాన్యం చెబుతుంది. అయితే విశాఖకు చెందిన కొందరు జనసేన పార్టీ నేతలు ఈ విషయంలో తొందర పడకుండా జాగ్రత్తగా ఆచూకీ తూచి మాట్లాడుతున్నారు. జరిగిన నష్టపరిహారం విషయంలో కొంత మేర నష్టాన్ని తాము భర్తీ చేస్తామని జనసేన నేతలు అన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని పలువురు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంతో ముడి పెట్టకుండా ఇరు పార్టీల నేతలు సంయమనం పాటించాలని కోరుతున్నారు. జనసేన పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తొందరపాటుగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా నిదానించినట్లు తెలుస్తుంది. అలాగే వైసిపి నేతలు కూడా ఈ వ్యవహారంలో సంయమనం పాటించినట్లు కూడా తెలుస్తుంది.