శత్రువుల దాడి సమయంలో తమ సంపదను కాపాడుకునేందుకు వాటిని రహస్య ప్రాంతాలలో భద్రపరుస్తూ ఉండేవారు. ఒకవేళ ఆ దాడిలో ఓటమి చెంది రాజ్యం శత్రువుల వసమైనప్పటికీ తమ బంగారు నిధులను వారికి దక్కకుండా ఉండాలనే క్రమంలో అలా ఈ ఏర్పాట్లు చేసేవారు. అయితే ఆ రహస్యం తమ వంశస్థులకు తప్ప మరెవరికీ తెలియనిచ్చేవారు కాదు. కానీ ఆ వంశంలో వారు కూడా యుద్ధాలు కారణంగా లేదా అనారోగ్య కారణాలతో చనిపోవడంతో ఆ నిధి రహస్యం ఎవరికి తెలియకుండా అలా మరుగున పడిపోయి ఉండేది. కానీ అప్పటి కాలంలో ఆ నిధి నిక్షేపాల గురించి కొందరు రాసిన పుస్తకాలలో శిలా శాసనాలలో ప్రస్తావిస్తూ వుండేవారు.అలాంటి నిధి రహస్యం ఒకటి 1976 ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి తెలిసి నిధిని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న ప్రచారం జరిగింది. అయితే ఆ నిధిని మరికొంతమంది చేజిక్కించుకుని దానిని విదేశాలకు తరలించారనే కధనాలు కూడా ఉన్నాయి అసలు ఆ నిధి ఏంటి ? దాని రహస్యం ఏంటి ? దానిని ఎవరు చేజిక్కించుకున్నారు ? ఎక్కడ భద్రపరిచారు..? మొఘల్ చక్రవర్తి అక్బర్ సంస్థానంలో ఉన్న కొందరు ప్రముఖులతోపాటు బీర్బల్ ను కొంత మంది హత్య చేశారు. దీనికి ప్రతికారంగా ఆ రాజ్యాల పై దాడి చేయాలని అక్బర్ నిర్ణయం తీసుకున్నాడు. సేనాధికారిగా అక్బర్ విజయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న రాజా మాన్ సింగ్ రాజా మాన్ సింగ్ కు ఆ బాధ్యతలు అప్పగించాడు. అక్బర్ ఆదేశంతో పెద్ద సైన్యంతో ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్లి అక్కడ రాజులను ఓడించి బీర్బల్ ను చంపిన యూసఫ్ ఖాన్ ను రాజా మాన్ సింగ్ హతమార్చాడు. అక్కడి రాజ్యాలపై పూర్తిస్థాయిలో విజయం సాధించి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అక్బర్ కు తెలియకుండా అమీర్ కోటలో ఉంచాడని ‘ ఆఫ్ తెలిస్మట్ ఆమ్ డైరీ ” అనే బుక్ లో ఈ నిధి వివరాలు రాసి ఉన్నాయట. మొఘలుల అనంతరం అధికారంలోకి వచ్చిన బ్రిటిషర్ల దృష్టికి ఈ విషయం వచ్చింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కోటలో రాజా మాన్ సింగ్ దాచిన బంగారు నిధి కోసం వెతకడం ప్రారంభించారట.. ఆ బుక్ లో రాసిన ప్రకారం ఆ బంగారు నిధి ఏడు వాటర్ ట్యాంకులలో నిక్షేపమై ఉన్నట్లు గుర్తించారు. దీనిని స్వాధీనం చేసుకునేందుకు బ్రిటిషర్లు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. తరువాత ఇందిరాగాంధీ పాలనలో మరోసారి ఈ నిధి కోసం చర్చ జరిగింది. 1975లో 18 నెలలు కొనసాగిన ఎమెర్జెన్సీ సమయంలో జయ్ ఘర్ మహారాణిగా గాయత్రి దేవి ఉన్నారు. గాయత్రి దేవికి ఇందిరాగాంధీకి అసలు పడేది కాదు. వారిద్దరికీ చదువుకున్న రోజుల నుంచే శత్రుత్వం ఉంది. గాయత్రి దేవి లోక్ సభ అభ్యర్థి గా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై గెలిచారు. 1976 జూన్ 10 న జయ్ ఘర్ కోట పై ఇందిరా గాంధీ ఇన్ కం ట్యాక్స్ టీమ్ ను పంపించే సమయంలోనే గాయత్రి దేవిని కొన్ని వేర్వేరు కారణాలవల్ల అరెస్టు చేసి జైలుకు పంపించారు. అదే సమయంలో ఇన్కమ్ టాక్స్ బృందంతో పాటు పోలీసులు, ఆర్మీ ఆ కోటను చుట్టుముట్టారు. బయటకు మాత్రం అది ఇన్కమ్ టాక్స్ తనిఖీలలో భాగంగా అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం రాజా మాన్ సింగ్ దాచిన నిధి కోసం అన్నది తర్వాత తెలిసింది. ఈ విషయం కోసం అప్పట్లో ప్రతి ఒక్కరు చర్చించుకునే వారు. ఆ సమయంలో కొందరు హెలికాప్టర్ ల పై ఆ కోటకు వస్తుండే వారు. అక్కడ వారికి నిధి దొరికిందని ఆ నిధిని హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి అక్కడ వారికి ఎటువంటి నిధి దొరకలేదు. అయితే రాజా మాన్ సింగ్ ఆ నిధిని అమీర్ కోటలో భద్రపరిస్తే వీళ్ళు జయ్ ఘర్ కోటలో ఎందుకు వెతుకుతున్నారో అప్పటికి ఎవరికి అర్థం కాలేదు. మొదటి రాజా మాన్ సింగ్ నిధిని అమీర్ కోట లో భద్రపరిస్తే మరొక కోటలో వెతకడం పై చాలా మందికి సందేహాలు తలెత్తాయి. ఈ జయ్ ఘర్ కోట నుంచి అమీర్ కోటకు సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో సొరంగ మార్గం కనుగొనడానికి ఆ కోటను చిందరవందర చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కోట లోపల జరిగే విషయాలు బయట వారికి తెలియకూడదనే అక్కడ కర్ఫ్యూ విధించారు. అదే సమయంలో ఎమర్జెన్సీ కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయట కనిపిస్తే నిర్ధాక్షణంగా కాల్చి చంపేస్తామని బెదిరించారు. దీంతో చాలామంది బయటికి రావడానికి భయపడ్డారు. ఈ నిధి అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పక్కనే ఉన్న పాకిస్తాన్ కు తెలిసింది. అప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాశారు.1947 కు ముందు ఏవైనా విలువైన వస్తువులు దొరికితే ఇరు దేశాలకు సంబంధించినవని వాటిపై తమ దేశానికి కూడా హక్కు ఉంటుందని లెటర్లో తేల్చి చెప్పారు. నిధి అన్వేషణ నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని లెటర్ కు భారత ప్రధాని రిప్లై ఇచ్చారు. అక్కడ తమకు ఏమి దొరకలేదని, తాము సెర్చ్ చేసింది నిజమేనని, మీకు ఇక్కడ దొరికే వాటితో ఎటువంటి సంబంధం లేదని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదని ఆ లెటర్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం పై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ 230 కేజీల వెండి మాత్రమే దొరికిందని అంతకంటే ఇక్కడే మరేమీ లభించలేదని స్పష్టం చేశారు.అయితే నిధి కోసం అన్వేషణ ఆపేసిన ముందు రోజు ఢిల్లీ- జయ్ పూర్ హై వే రోడ్ ని నిలిపివేశారు. కేవలం ఆ దారి గుండా ఆర్మీ ట్రక్స్ మాత్రమే వెళ్లాయి. సుమారు 50 ట్రక్కులు ఆ మార్గం గుండా వెళ్లాయి. ఆ ఒక్కరోజు మాత్రమే ఆ మార్గాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఆ ట్రక్కుల ద్వారా రాజా మాన్ సింగ్ దాచిన నిధిని రహస్యంగా తరలించారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆ నిధిని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి రెండు విమానాల ద్వారా స్విట్జర్లాండ్ కు తరలించారనే మరో ప్రచారం కూడా ఉంది. ఢిల్లీ జైపూర్ హైవే ను సెక్యూరిటీ పర్పస్ కోసమే నిలిపివేసినట్లు అప్పటి అధికారులు పేర్కొనడం విశేషం.నిధిని రహస్యంగా దేశాన్ని దాటించారనే దాని పై వస్తున్న ఆరోపణల పై అయితే ప్రభుత్వం స్పందించలేదు. ఇందులో ఏది అబద్ధమో ఏది నిజమో అనేది కూడా స్పష్టంగా తెలియదు.