2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ అంతర్గత సర్వేలో తేలిందని పార్టీ వర్గాలు ఖుషి లో ఉన్నాయట. దాన్ని సద్వినియోగం చేసుకునేలా తెలుగుదేశం పార్టీ పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తుంది విజయావకాశాలు బాగా ఉన్న నియోజకవర్గాల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దని పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారట. 2019 ఎన్నికల్లో గెలుచుకున్న 23 నియోజకవర్గాలతో పాటు వెయ్యి రెండువేల ఓట్ల తేడాతో కోల్పోయిన కొన్ని సీట్లతో కలిపి 79 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకోగలమనే అంశంపై ఆ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో తేలిందట పార్టీ శ్రేణులు కొంచెం శ్రద్ధ పెట్టి కష్టపడితే 79 నియోజకవర్గాలను గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ప్రభుత్వ వ్యతిరేకత పై కన్నా పార్టీ పటిష్టత పై దృష్టి పెడితే నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి రావడం ఖాయమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇందుకు అనుగుణంగా పనిచేయాలంటూ చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు ఉద్భోదించినట్లు సమాచారం. విజయావకాశాలు ఉన్న నియోజకవర్గాలతోపాటు కచ్చితమైన రాజకీయ వ్యూహాలను అవలంబించి పోరాడితే మరికొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని టీడీపీ భావిస్తోంది. పొత్తులు కుదిరితే తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు మరింత మెరుగుపడుతాయని, అయితే పొత్తులతో సంబంధం లేకుండా ఒంటరిగా వెళ్లినా విజయం సాధించగలిగేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.పార్టీ వర్గాలు పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ. చంద్రబాబు మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు.