“మాచర్ల” తో ఆడియన్స్ మైండ్ సెట్ తేలిపోయిందా..?

భింభిసార, సీతారామం, కార్తికేయ2 చిత్రాలు తెలుగు ఇండస్ట్రీకి ఎంత ఆక్సిజన్ ని అందించాయో ఆచార్య, రామారావు ఆన్ డ్యూటీ, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాలు అంతే గుణపాఠాన్ని నేర్పించాయి. రొటీన్ రొడ్డకొట్టుడు చిత్రాలు ఎంత స్టార్ హీరోవైనా చూసేదే లేదని తేల్చేశారు ప్రేక్షకదేవుళ్లు.. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ గురించి ప్రస్తావించుకోక తప్పదు. అన్ని రంగాలకన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయిన రంగం ఎంటర్టైన్మెంట్ రంగం(మీడియా, ఓటీటీ లకు మినహాయింపు) కోవిడ్ కు ముందు పరిస్థితులు వేరు… తదనంతర స్థితిగతులు వేరు.. థియేటర్ లొనే చూసే సినిమా వస్తే తప్పా ప్రేక్షకుడు కదిలే పరిస్థితి లేదు. దానికి అన్ని కారణాలతో పాటు కంటెంట్ కూడా ఓ కారణం. సినిమా థియేటరే ఏకంగా చేతిలోకి రావడం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో అన్ని భాషల కంటెంట్ చూసే అవకాశం అతిదగ్గరగా ఉండడం.. చౌకగా ఇలాంటి సౌకర్యం అందుబాటులో వున్నప్పుడు అంత ఖర్చు పెట్టుకొని ధియేటర్ కు వెళ్లడం అవసరమా అని ప్రేక్షకుడి ప్రశ్న. పైగా సినిమా రిలీజ్ డేట్ తో పాటు ఓటీటీ విడుదల తేదీ కూడా ఎనౌన్స్ చేస్తున్న నేపథ్యంలో థియేటర్ కు పోవడం ఎందుకు..? అని ఫ్యామిలీ ఆడియన్స్ భావన. దాదాపుగా అందరి ఆలోచన ఇలాగే టర్న్ అయిపోయింది. ఇక్కడ ఆలోచించాల్సిన మేటర్ ఏంటంటే ప్రపంచ భాషల సినిమాలన్నీ చూసేసి ప్రేక్షకుడు అప్ గ్రేడ్ ఆవుతుంటే మేకర్స్, కొంతమంది హీరోలు ఇంకా పాతచింతకాయ పచ్చడి నే ఆస్వాదిస్తున్నారు.. ఫలితాలు చూసికూడా సాకులు వెతుక్కుంటూ తమ నిర్ణయాన్ని సమర్ధించుకునే వాళ్ళు కూడా వున్నారు.. కోత్తదనం ఉంటే తప్పా మేము సినిమాకి రాము అని చెప్పకనే చెప్తున్నా అదే మూస కధలను వండుతున్న మేకర్స్ కు గాని వాటిని నమ్ముతున్న హీరో లకు గాని ఇక లాస్ట్ చాన్స్ కూడా అయిపోయినట్టే అంటున్నారు సోకాల్డ్ ఆడియన్స్. 40కోట్ల రూపాయల వ్యయం తో రూపొందిన ఓ ఎనర్జిటిక్ స్టార్ సినిమా కొన్నిచోట్ల ఆడియన్స్ లేక షో రద్దు చేసే పరిస్థితి వచ్చిందంటేనే అర్ధం చేసుకోవచ్చు తీవ్రత ఏస్థాయిలో ఉందో.. కొంతమంది మేకర్స్ , స్టార్స్ అంతకుముందు ఒకే అనుకున్న కధల్ని సైతం ఇప్పుడు తిరిగి వండుకునే పరిస్థితి వచ్చింది..తప్పదు మరి ఇప్పుడున్న సమయంలో ఒకటికి పదిసార్లు స్క్రిప్ట్ దశలోనే సరిచేసుకుంటేనే సరైన ఫలితాలు వస్తాయి ఇది మాత్రం పక్కా..

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More