మళ్ళీ రాబోతున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘స్క్విడ్ గేమ్’

అందరిని అలరించిన ఎమోషనల్ ధ్రిల్లర్ స్క్విడ్ గేమ్ మళ్ళీ రాబోతోందని నెట్ ఫ్లిక్స్ ఎనౌన్స్ చేసింది. 2023 ఎండింగ్ లో గాని 2024 ప్రారంభం లోగాని సీజన్ 2 స్టార్ట్ అయ్యే అవకాశం వుందని దర్శకుడు హ్యాంగ్ డొంగ్ హ్యూక్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు… నెట్ ఫ్లిక్స్ గాని నిర్మాణ సంస్థ గాని ప్రారంభ తేదిని సమయాన్ని పేర్కొనక పోయినా సీజన్ 2 లో మొదటి భాగాన్ని మించి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని డైరెక్టర్ తెలిపాడు. … నిజానికి ఈ కధను 2008 లోనే దర్శకుడు హ్యాంగ్ డొంగ్ హ్యూక్ తయారుచేసుకున్నప్పటికి ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దానిని తెరకెక్కించలేక పోయాడు… 70,80 దశకాలలో కొరియా లో వుండే పాపులర్ చిల్డ్రన్ గేమ్ ల ఆధారం గా దీన్ని తయారుచేసుకున్నాడు… 2019 లో నెట్ఫ్లిక్స్ ఫారిన్ ప్రోగ్రామింగ్ ఆఫరింగ్ లో భాగంగా ఈ ప్రాజెక్టు ని ఓకే చెయ్యడం తో సిరెన్ పిక్చర్స్ ఐ ఎన్ సి తో కలిసి ధీన్ని నిర్మించారు.. రెడ్ లైట్ .. గ్రీన్ లైట్ , హెల్ , ది మెన్ విత్ అమ్బ్రెల్ల , స్టిక్ ద టీం , ఏ పెయిర్ వల్డ్ , గాంభు , వి ఐ పిస్ , ఫ్రంట్ మెన్ , ఒన్ లక్కీ డే వంటి 9 ఎపిసోడ్లు ఈ సీరీస్ లో వున్నాయి.. అవసరం… అవకాశం ఈ రెండే మనిషి స్థితి ని గతి ని మార్చేవి… ఆనందం ఒక్కొక్కరు ఒక్కో చోట.. ఒక్కో రీతిన వెతుక్కుంటా రు… అంతరాలన్నీ వున్నోడు లేనోడు ఈ తేడాల్లోనే నలిగిపోతుంటాయి… పేదోడికి ఆపూట తిండి దొరికితే ఆనందం… మద్యతరగతి జీవికి నెలంతా సాఫీ గా సాగిపోతే ఆనందం కానీ… డబ్బునోడి ఆనందానికి ఆకలెక్కువ… ‘జీవితం లో అన్నీ అనుభవించేశాం… కోరుకున్నవన్నీ దొరకడం కూడా బొరే… అందుకే ఫన్ కావాలి… మనిషి చావుతో పోరాటం చేస్తూ కళ్ళముందే చనిపోతుంటే ఆ కిక్కే వేరు అన్న మనస్తత్వాలు ఓవైపు… ఆశ కి ఆరాటంకి మద్య నలిగిపోతున్న ప్రాణాలు మరో వైపు… ఆడే ఆటే ‘స్క్విడ్ గేమ్’ గత సంవత్సరం సెప్టెంబర్ 17 న నెట్ఫిల్క్స్ లో విడుదలైన ఈ వెబ్ సీరీస్ జీవితాలకు దగ్గరగా వుండే పాత్రలతో మనల్ని కూడా ఆ గేమ్ లో నడిపిస్తుంది… ఎమోషనల్ ని పండించడం లో భారతీయుల కన్నా కొరియన్లదే పై చేయి.. ఓ చిన్న దేశం తీసిన పారాసైట్ ఆస్కార్ అందుకోవడమే అందుకు నిదర్శనం.. ‘మీరు ఆడే రేసుల్లో గుర్రాలుంటాయి… డబ్బున్న ఈ మృగాలు ఆడే ఆటల్లో మనుషులుంటారు… ‘అండర్ కరెంట్ గా ఇదే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్.. సర్వైవల్ గేమ్ పై చాలా సినిమాలు వచ్చినప్పటికి దీనికి బలమైన ఎమోషన్ ని ఎడ్ చెయ్యడం వలన మరింత ఇంటెన్సిటి పెరిగిందనే చెప్పవచ్చు.. ఆర్ధిక ఇబ్బందులతో సావాసం చేస్తున్న కొంతమంది కి డబ్బాశ చూపించి ఎవరికి తెలియని ఓ కొత్త ప్రపంచానికి 456 మంది ని తీసుకెళ్లి ఓ డెత్ గేమ్ ఆడిస్తారు అందులో గెలిచిన వాళ్ళు మాత్రమే బతికుంటారు మిగిలిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవల్సింధే… ఎవరైతే అన్నీ రౌండ్స్ లో ప్రాణాలు నిలుపుకుంటారో ఆ ఒక్కడికి 45.6 బిలియన్ కొరియన్ వాన్ లు అంటే 39 మిలియన్ యూ ఎస్ డాలర్లు ప్రైజ్ మనీ గా అందుతుంది… రక్తపాతం ఎక్కువే వున్నా మానవ సంబంధాలను ఆవిష్కరించిన తీరు మనల్ని ఎమోషనల్గా కట్టి పడేస్తుంది… కొంత లాగ్ వున్నప్పటికి ఆద్యంతం మనం ట్రావెల్ అవుతూనే వుంటాం… నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటివరకు టాప్ లో వున్న మనీ హీస్ట్ , ల్యుపిన్ , సీరీస్ లను వెనక్కి నెట్టేసింది లీ జంగ్ జీఓ ప్రధాన పాత్ర పోషించిన ఈ సీరీస్ లో సౌత్ కొరియా లో స్థిరపడిన భారతీయ నటుడు అనుపమ్ త్రివేధి ఓ ముఖ్యపాత్ర లో కనిపించాడు… ఇప్పటికే పెద్ద హిట్ అయిన స్క్విడ్ గేమ్ సీజన్ టూ పై ప్రకటన రావడం తో మళ్ళీ అంచనాలు మొదలయ్యాయి …

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More