ఆ ట్రాఫిక్ పోలీసుల తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.దేశంలో ఎక్కడా లేని రూల్ పెట్టి వాహనదారులకు చలానా లేస్తూ విమర్శల పాలవుతున్నారు. చేసిన పొరపాటు కవర్ చేసుకోలేక నానా యాతనా పడుతున్నారు.. ఇంతకు మేటర్ ఏంటంటే బైక్ లో సరిపడా పెట్రోల్ లేదని ఆ వాహనదారుడు కి కేరళ ట్రాఫిక్ పోలీసులు 250 రూపాయల చలానా వేశారు. ఇప్పుడిదే నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది. ఐటీ ఉద్యోగి బాసిల్ శ్యామ్ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌పై కొచ్చిలోని పుక్కట్టుపడి ఏరియా నుంచి ఉదయం 10 గంటల సమయంలో ఆఫీస్‌కు వెళుతున్నాడు. వన్ వేలో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బండిని ఆపి రూ. 250 చలాన్ విధించారు. శ్యామ్ ఫైన్ కట్టేసి ఆఫీస్‌కు వెళ్ళాడు. చలానాలో ఏముందోనని ఓసారి చెక్ చేయగా అతడికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. వాహనంలో సరిపడా ఇంధనం లేనందుకు జరిమానా విధించినట్టు ఆ రసీదులో ఉంది. బైక్‌లో సరిపడా ఇంధనాన్ని క్యారీ చేయాలనే రూల్ భారత దేశంలో లేనే లేదు. కానీ కేరళలో మాత్రం ఆటో, కార్లు వంటి ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు తప్పనిసరిగా సరిపడా ఇంధనాన్ని కలిగి ఉండాలి. లేకపోతే అక్కడి అధికారులు ఫైన్ విధిస్తారు. ఇంధనం అయిపోయి వాహనాలు ఆగిపోతే ప్రయాణికులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధన బైక్‌కు వర్తించదు. ట్రాఫిక్ పోలీసులు చేసిన పొరపాటున గుర్తించిన బాసిల్ శ్యామ్ ఆ రసీదును తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం కాస్త వైరల్‌గా మారింది. ఇప్పుడు నెట్టింట దీని పై తెగ చర్చ నడుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు పొరపాటున చేసిన తప్పిదం పై మాత్రం నెటీజన్లు వ్యంగ్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.