బాబుతో .. మోహన్ బాబు భేటీ రాజకీయవర్గాల్లో చర్చ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో జగన్ సమీప బంధువు, సినీ నటుడు మోహన్ బాబు భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు టీడీపీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆ తర్వాత చంద్రబాబు, మోహన్ బాబు మధ్య దూరం పెరిగింది. మంచు ఫ్యామిలీ.. వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యింది. మోహన్ బాబు కుమారుడు విష్ణు.. వైఎస్ సోదరుడి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. చంద్రబాబు హయాంలో తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ బకాయిల విషయమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహన్ బాబు ధర్నా సైతం చేపట్టారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదైంది. టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని మోహన్ బాబు ఆరోపించారు. ఆ తర్వాత ఆయన వైఎస్సార్సీపీలో చేరి.. ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆయన సైలెంట్ అయ్యారు. 2020 ఆరంభంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను మోహన్ బాబు కుటుంబ సమేతంగా కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరతానే ప్రచారం జరిగినప్పటికీ.. కానీ అలాంటిందేం జరగలేదు. గత ఏడాది ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు సాధించారు. అప్పుడు మోహన్ బాబు మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టు కనిపించారు. చంద్రబాబుకు స్నేహానికి అర్థం తెలీదని.. తన మనసు గాయపరిచారంటూ గతంలో ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించిన మోహన్ బాబు.. ఇటీవల మెత్తబడినట్లుగా కనిపిస్తోంది. సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్ ఇద్దరూ తనకు బంధువులేనన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్ల సమయంలో తనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదని.. ఈ జన్మకు రాజకీయాలు వద్దని అనుకుంటున్నానని తెలిపారు. చంద్రబాబుకు ప్రచారం చేసినట్టే జగన్‌కు కూడా తాను ప్రచారం చేశానన్నారు. సీఎం జగన్‌తో మోహన్ బాబుకు విభేదాలు ఉన్నాయని ఇటీవల ప్రచారం జరగ్గా.. తాను బీజేపీ మనిషినంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ నెలలో కోర్టు ముందు హాజరవడం కోసం తిరుపతి వెళ్లిన సందర్భంగా మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తీరా ఇప్పుడు వెళ్లి ఆయన టీడీపీ అధినేతను కలవడం చర్చనీయాంశమైంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More