” టికెట్ రేట్లు పెంచడం లేదు ” సినిమా విడుదలకు ముందే ప్రకటనలు..

కరోనా నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రభుత్వంతో పోరాటం చేసి మరీ టికెట్ రేట్లను పెంచేలా చేశారు ఇండస్ట్రీ పెద్దలు.కానీ ఇప్పుడిప్పుడే ఈ విషయంపై నిర్మాతలు కళ్ళు తెరుచుకుంటున్నాయి అన్నది తెలుస్తుంది. మొన్నటి వరకు టికెట్ రేట్లు పెంచాలని డిమాండ్ చేసిన నిర్మాతలు నేడు తమ సినిమాకు టికెట్ రేట్లు పెంచటం లేదు అంటూ విడుదలకు ముందే ప్రకటనలు చేస్తున్నారు. పైకి పాన్ ఇండియా స్థాయి సినిమాలను తెరకెక్కిస్తామని చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే నిర్మాతలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. టికెట్ రేట్లు భారీగా పెంచిన నేపథ్యంలో ప్రేక్షకుడు థియేటర్ కు రావాలంటేనే భయపడి పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు థియేటర్ లలో కూల్ డ్రింక్స్ ఇతర తినుబండారాలు రేట్లు కూడా అధికంగా ఉండటంతో ప్రేక్షకుల జేబులు చిల్లులు పడుతున్నాయి. ఒక కుటుంబం మొత్తం సినిమాకి రావాలి అంటే నెల జీవితం మొత్తం కూడా సినిమాకే ఖర్చయి పోతుంది. దీంతో ప్రేక్షకులు థియేటర్ కు రావడానికి భయపడుతున్నారు. సినిమాకు వెళ్లి డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు చేసే బదులు అదేదో ఓటిటి ని నమ్ముకుంటే బెటర్ కదా అని ఆలోచిస్తున్నారు. ఈ కారణంగా వంద కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాతలకు నష్టాలను తప్పడంలేదు. ఇటీవల నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న నష్టాలు తప్పేలా లేవు అన్నది తెలుస్తుంది.ఇక విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. అయితే ఇక్కడ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు విడుదలైన అఖండ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధించి లాభాలను తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక్కడ మరో విషయం ఏంటంటే సినిమా బాగుంటే దాని విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరన్నది నిజం. అయితే కరోన బూచి చూపి టికెట్ రేట్లు పెంచడం వలన సినీ ఇండస్ట్రీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కొనసాగితే తెలుగు చిత్ర పరిశ్రమ రానున్న రోజుల్లో ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందనేది స్పష్టం అవుతుంది. ఇప్పుడు జనాలు థియేటర్ ల కంటే ఓటిటి లనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మల్లీ ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించాలి అంటే తప్పనిసరిగా టికెట్ రేట్లు తగ్గించాలిసిందేనని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందు మా సినిమాకు టికెట్ రేట్లు పెంచడం లేదని ప్రకటనలు ఇవ్వాలిసిన పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More