గ్రేటర్ లో పట్టు కు పార్టీల ఎత్తులు

ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల బలాబలాలు, రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నాయి.. ఇప్పట వరకు ఉన్న పట్టును టీడీపీ నిలుపుకుంటుందా.. అధికారంలోకి వచ్చిన వైసీపీ సత్తాను చాటుతుందా.. గాజువాకలో ఓటమి పాలైన పవన్ పావులు ఈసారి ఎలా పని చేయబోతున్నాయి. విశాఖ పాలిటిక్స్ లో లేటెస్ట్ గా ఏం జరుగుతుందో అన్నిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఉన్న తాజా పరిస్థితుల ప్రకారం విశాఖ సిటీ వరకు టీడీపీ కే పూర్తి పట్టు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ హవా గత వీచినప్పటికీ వైజాగ్ లో మాత్రం టీడీపీ జయకేతనం ఎగురువేసింది. విశాఖ అర్బన్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో విశాఖ సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందగా, మిగిలిన గాజువాక, పెందుర్తి, భీమిలి స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఈ పట్టును ఎలాగైనా నిలుపుకోవాలని టీడీపీ భావిస్తోంది. అయితే శివారు ప్రాంతాలు కాకుండా నగరంలో పట్టు సాధించి టీడీపీని మట్టికరిపించాలని వైసీపీ తహతహలాడుతోంది. విశాఖ ఈస్టు లో పాతుకుపోయన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను ఈసారి ఎలాగైనా మట్టి కరిపించేందుకు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నందున అదే క్యాస్ట్ కు చెందిన విజయ నిర్మలను వైసీపీ మోహరించింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడిని ఓడంచడానిికి సర్వశక్తలు ఒడ్డుతున్నారు. అలాగే విశాఖ సౌత్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేశ్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. అయితే అప్పటికే అక్కడ కాపు కాసిన వైసీపీ క్యాడర్ కు, వాసుపల్లితో వచ్చిన టీడీపీ క్యాడర్ కు పొసగటం లేదు. ఇది చాలదన్నట్టుగా వైసీపీ నేత, బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ కూడా అదే స్థానంపై కన్నేసి రాజకీయం చేస్తుండటంతో వైసీపీ రాజకీయం రోడ్డున పడింద. ఇక విశాఖ నార్త్ లో వైసీపీకి రియల్ ఎస్టేట్ వ్యాపారి కే కే రాజు సమన్వయకర్తగా ఉన్నారు. ఈ స్థానం నుంచే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. ఆయన టీడీపీ క్యాడర్ ను పట్టంచుకోకపోవడంతో కే కే రాజునే ఎమ్యెల్యేగా చెలామణి అవుతున్నారు. ఇదే ఊపులో ఈ స్థానంలో బలమైన టీడీపీ ప్రత్యర్థి లేకపోవడంతో గెలవాలని కే కే రాజు గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. విశాఖ వెస్ట్ లో సమన్వయకర్తగా ఉన్న మళ్ల విజయ ప్రసాద్ ఆర్థిక నేరాల్లో జైలుకు వెళ్లడంతో ఈ స్థానంలో విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీ రావు కుమారుడు ఆనంద్ సమన్వయ కర్తగా తాజాగా నియమించబడ్డారు. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడపోయారు. అయతే గవర సామాజిక వర్గం ఎక్కవగా ఉండటంతో తన వ్యూహం ఫలిస్తుందని వైసీపీ ఆశిస్తోంది. ఇక గాజువాక, పెందుర్తి, భీమిలి స్థానాలు వైసీపీ చేతిలో ఉన్నా సరే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం వైసీపీక లేదు. దీంతో అక్కడ కొత్త ప్లాన్ అమలు చేస్తోంది వైసీపీ అదిష్టానం. విశాఖ విషయంలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు నిలుపుకుని సత్తా చాటాలని తహ తహ లాడుతోంది. వైజాగ్ నగరం నలు దిక్కుల స్థానాలు నిలుపుకోవడంతో పాటుగా గతంలో పట్టుండి కోల్పోయన భీమిలి, గాజువాక, పెందుర్తి స్థానాలను తిరిగి కైవశం చేసుకోవాలని భావిస్తోంది. దీంతో టీడీపీ విశాఖపై గట్టిగానే ఫోకస్ చేసింది. సమన్వయకర్తలను బిలమైన అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహం అమలు చేస్తోంది. విశాఖ సౌత్ లో గండి బాబ్జీ, భీమిలికి కోరాడ రాజబాబు వంటి వారిని ఇన్ చార్జిలుగా నియమించారు. మిగిలిన స్థానాల్ల క్యాడర్ ను యాక్టివేట్ చేస్తూ ఎన్నికల సమయంలో బలమైన అభ్యర్థిని దింపాలని టీడీపీ వ్యూహం పన్నింది. హూద్ హూద్ తో పాటుగా గతంలో విపత్కర పరిస్థితుల్లో చేసిన కృషిని, అభివృద్ధి పనులను మరోసారి చాటి చెప్పి పగ్గాలు నిలిపుకోవాలని గట్టి పట్టుదలతో ఉంద. విశాఖ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా చాలా క్లారిటీ ఉంది. దీంతో టీడీపీకి విశాఖ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ విషయంలో ప్రతీకారం తీర్చుకోవాలని జనసేన బావిస్తోంది. ఆ పార్టీ అధినేత పవన కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆ అవమాన భారాన్ని వదిలించుకోవాలంటే ఈ సారి విశాఖలో సత్తా చాటాలని జనసేన ప్లాన్ చేస్తోంది. అయితే పవన్ కల్యాణ్ ఛరిష్మా తప్పితే పెద్గగా బలమైన స్థానిక నేతలు లేకపోవడం జనసేనకు మైనస్. కొద్దకాలం క్రితం జరిగిన గ్రేటర్ విశాఖ కార్పరేషన్ ఎన్నికల్లో జనసేన మూడు కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో తాము నగరంలో బలపడ్డామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతామని జనసైనికులు ఘంటా పథంగా చెబుతున్నారు. ఇక బీజేపీ కూడా పట్టు చాటాలని గట్టిగా పనిచేస్తోంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులను పదే పదే నగరానికి రప్పించ సభలు, సమవేశాలు జరిపిస్తుండటంతో కొత్త ఉత్సాహంతో ఉన్నారు. ఇక మిగిలిన కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా బలమైన నేతలు లేకపోయినా ఉన్న ఓటు బ్యాంక్ ను చాటుకుని తమ ఊనికిన కాపాడుకోవాలని భావిస్తున్నాయి. మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలు విశాఖను కైవశం చేసుకోవడంపై కన్నేసాయనే చెప్పుకోవాలి.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More