భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం సాయంత్రం జరిగే టి -20 సీరీస్ లో గల 3 వ మ్యాచ్ కు ఏసీఏ- విడిసిఎ క్రికెట్ స్టేడియం సర్వం సిద్ధమైంది.స్టేడియం లోపల 730 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులను,స్టేడియం బయట 500 మంది ట్రాఫిక్ పోలీసుల సిబ్బంది నీ, ఇతర తనిఖీ విభాగాలు కలుపుకొని మొత్తం 1430 మంది పోలీసులతో కట్టు దిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.ప్రేక్షకులు స్టేడియంలోనికి ప్రవేశించేందుకు గాను స్టేడియం చుట్టూ 20 గేట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.సాయంత్రం 7 గంటలకు ప్రారంమయ్యే ఈ మ్యాచ్ రాత్రి 11:30 గంటల వరకు జరుగుతుందని అన్నారు. 27 వెలు మంది సామర్థ్యం కలిగిన స్టేడియం లో ప్రేక్షకులకు ఏటువంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్ఠమైన సౌకర్యాలు కల్పించమని అన్నారు. ఇదిలా ఉండగా స్టేడియం లోపలికి ప్రవేశించే వారికి ఏటువంటి తినుబండారాలు, వాటర్ బాటిల్స్, జెండాకర్రాలను లోపలికి అనుమతించమని పోలీసులు పటిష్ఠమైన ఆంక్షలు విధించారు.ఇరు జట్లు సోమవారం సాయంత్రానికి నగరానికి చేరుకున్నాయి.నగరంలో ఎప్పుడు క్రికెట్ జరిగిన క్రీడాకారులకు నోవేటెల్ లో అతిద్యం అందించేవారు.అయితే క్రీడాకారులు స్టేడియం కి చేరుకునే సమయంలో ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడుతున్న కారణంగా వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ సారి ఇరు జట్ల కి రుషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న రాడిసన్ హోటల్స్ లో వసతి ఏర్పాట్లు చేశారు. సీరీస్ కోసం టిం ఇండియా పోరాటం…. ఇండియా – సౌత్ ఆఫ్రికా టి -20 అయిదు సీరీస్ మ్యాచ్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లను సౌత్ ఆఫ్రికా కైవసం చేసుకుంది.మంగళవారం నాడు విశాఖ లో జరిగే మ్యాచ్ నీ భారత్ కైవసం చేసుకొని సీరీస్ నీ గెలుపొందేందుకు సన్నాహాలు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో విశాఖలో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచిన సందర్బాలు ఉన్నాయి కనుక ఈ మ్యాచ్ నీ కైవసం చేసుకునేందుకు ఎదురు చూస్తోంది.పైగా సౌత్ ఆఫ్రికా జట్టు విశాఖలో స్టేడియంలో ఇదే మొదటి సారి ఆడుతోంది. పైగా పి ఎం పాలెం స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో టీమ్ ఇండియా ఈ మ్యాచ్ నీ గెలిచి సీరీస్ నీ గెలుపొందేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది.