కలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు..?

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్న టిడిపి, జనసేన పార్టీలు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. బిజెపి కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచింది. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతుంటే ఇటు జనసైనికులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొట్టి మరి చెప్పేస్తుతున్నారు అంటే వచ్చే ఎన్నికలలో అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఓ వైపు చీలనివ్వం పవన్ కళ్యాణ్ వివిధ సమావేశాలలో, ప్రెస్ మీట్లలో పదేపదే చెబుతున్నారు. వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే కచ్చితంగా టిడిపితో కలిసి పోటీలోకి దిగాల్సిందే. టిడిపి – జనసేనల మధ్య పొత్తు కుదిరితే సీఎం అభ్యర్థి ఎవరనే దాని పై మరో మారు రచ్చ జరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తేనే టిడిపి తో పొత్తు ఉంటుందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. లేదు అంటే తాము ఒంటరిగా బరిలోకి దిగి వైసీపీని ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇరు పార్టీల పొత్తు వల్ల సీఎం అభ్యర్థి పై ఒక వేళ చర్చ జరిగితే మాత్రం కచ్చితంగా చంద్రబాబు నాయుడుకే మొగ్గు చూపాలని మెజార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే జనసేన ను కాదని కూడా టిడిపి ఒంటరిగా పోటీలోకి దిగేందుకు సమాయత్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా ఓటింగ్ శాతం లేని బిజెపి ఈ ఎన్నికలలో మరింత పుంజుకోవాలని చూస్తుంది. ఇప్పటికీ తమ మిత్రపక్షం జనసేన పార్టీనే అని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. వాళ్లు కూడా వచ్చే ఎన్నికలలో తమ సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు చూసుకుంటే క్షేత్రస్థాయిలో బిజెపి, జనసేన పార్టీలకంటే టిడిపి చాలా బలంగా ఉంది. టిడిపి, జనసేన విడివిడిగా పోటీ చేస్తే మాత్రం మళ్లీ వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిడిపి – జనసేన నేతల మధ్య ప్రస్తుతం సీఎం కుర్చీపై చిన్నపాటి రగడ జరుగుతుంది. రాష్ట్రంలో ఎప్పుడు రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే ముఖ్యమంత్రులు అవుతున్నారని, రాష్ట్రంలో ఓటింగ్ శాతం అధికంగా ఉన్న మరొక సామాజిక వర్గానికి అవకాశం ఎందుకు రావడం లేదని జనసేన పార్టీ నేతలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి జనసేన నుంచి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కానీ గ్రౌండ్ రిపోర్ట్ ను చూస్తే మాత్రం జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసిన వైసీపీని ఎదుర్కోలేదని స్పష్టంగా తెలుస్తుంది. సీఎం కుర్చీ పై పెనుగులాటతో తిరిగి జగన్ మోహన్ రెడ్డినే గెలిచే విధంగా ప్రతిపక్ష పార్టీలు వాదలాడుకుంటూన్నాయని తెలుస్తోంది. సీఎం కుర్చీపై ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రగడను ఒకపక్క అధికార వైసీపీ పార్టీ గమనిస్తూనే ఉంది. ఆ పార్టీకి కావాల్సింది కూడా అదే. ప్రతిపక్షాల మధ్య ఉన్న ఆ ఐక్యతను చెడగొట్టి, వారిలో వారే వాదలోడుకునే విధంగా, ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటే అది తమ పార్టీకి ఎంతో లాభిస్తుందని వైసిపి నేతలు భావిస్తున్నారు. అయితే పొత్తుల విషయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య ఇంకా స్పష్టత అనేది రాలేదు. ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు స్పష్టత ఇవ్వలేదు. బిజెపి అయితే టిడిపితో కలిసి పని చేసేందుకు సుముఖంగా లేదు. జనసేనతో కలిసి ముందుకు వెళ్తామని ఇప్పటికి ఆ పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. మళ్లీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీలోకి దిగితే ఆ ప్రభావం గట్టిగా వైసీపీపై పడునుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో 15 నెలల తర్వాత రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటివరకు తాము ప్రజల కోసం ఏం చేసాయో చెబుతున్నాయి. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో తెలియజేస్తున్నాయి.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More