లైగర్ కి కష్టాలు, నెగిటివ్ పబ్లిసిటీలు, ఇప్పట్లో వదిలేలలేవు ఫస్ట్ షో నుంచి నెగటివ్ తెచ్చుకున్న పూరి విజయ క్రాస్ బ్రీడ్ పై ప్రేక్షకులు వరుస మీమ్స్ తో కామెంట్స్ తో బాయ్ కాట్ ట్రెండింగ్స్ తో హోరెత్తిస్తుంటే తాజాగా ఐఎండిబి రేటింగ్స్ ఈ క్రాస్ బ్రీడ్ కి కోలుకోలేని షాక్ నిచ్చాయి పనికిరాని చెత్త సినిమాలు సైతం ఐఎండిబి లో ఓకే అనిపించుకునే రేటింగ్ ని కనపరుస్తుండగా లైగర్ మాత్రం అత్యంత పేలవమైన రేటింగ్ సాధించి చెత్త రికార్డును మూటగట్టుకుంది ఐఎండిబి లో పదికి కేవలం 1.6 రేటింగ్ ని పొందడం ఈ చిత్రం పై ఉన్న నెగెటివిటీ కి నిదర్శనం. ఇటీవల తెలుగు డిజాస్టర్ టాక్ మూటకటుకున్న రామారావు ఆన్ రోడ్ కు సైతం 5.8 రేటింగ్ రాగా నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం 5.7 రామ్ నటించిన ది వారియర్ కు 4.8 రేటింగ్స్ వచ్చాయి దేశవ్యాప్తం గా బాయ్కట్ ట్రెండింగ్ లో అట్టర్ ప్లాప్ అయిన లాల్ సింగ్ చద్దాకు 5.0 రక్షాబంధన్ కు 4.6 దోబార కు 2.8 కనీస రేటింగ్స్ కట్టబెట్టిన ఐఎండిబి ఫాలోవర్స్ లైగర్ కి ఇంత పూర్ రేటింగ్స్ ఇవ్వడమే కాకుండా ఈ సంవత్సరం వచ్చిన ఐఎండిబి రేటింగ్స్ లో అత్యల్ప రేటింగ్స్ కూడా ఇదే కావడం విశేషం.