ప్రపంచమంతా మూఢనమ్మకాలు బలంగానే ఉన్నాయి. ప్రాంతాలు, అలవాట్లు, బట్టి ఆయా నమ్మకల స్థాయి మారుతుంది మనిషి భయపడేది దేవుడికి దెయ్యానికి మాత్రమే సాత్వికమైన కోరికలకు దేవుడ్ని ఆశ్రయిస్తే అసహజమైన కోరికల సాధనకు దెయ్యాన్ని , క్షుద్రాన్ని, ఆశ్రయిస్తుంటారు. స్వార్థ శక్తులు దుష్టశక్తులకు అనుసంధాన కర్తే మాంత్రికుడు బ్లాక్ మెజీషియన్. అలాంటి తాంత్రికులు నాగరిక ప్రపంచంలో పూజలు చేస్తుంటే ప్రజలు తరిమి దాడులు చేసిన సంఘటనలు సందర్భాలు వార్తలు మనం చాలా చూసాం విన్నాం.. కానీ ఆ గ్రామంలో అందరూ తాంత్రికులే ప్రతి ఇంట్లో కనీసం ఒక బ్లాక్ మెజీషియన్ అయినా ఉంటాడు మరి అలాంటి గ్రామం మనదేశంలోనే ఉంది అస్సాం లోని మారిగోయన్ జిల్లా లో ఉంది. ఇది రాజధాని గౌహతికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది మయాంక్ అనే గ్రామం తాంత్రిక గ్రామంగా పేరుపొందింది. దీన్ని ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ గా పిలుస్తున్నారు. మయూర్ అంగ్ అన్న దేవత పేరు మీదుగా ఈ గ్రామం ఏర్పడిందని, మౌచోంగ్ వంశానికి చెందినవారు ఇక్కడ ఎక్కువగా నివసించడం వలన ఈ ప్రాంతానికి మయాంగ్ అని పేరు వచ్చింది అని చెప్తుంటారు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మహాభారతంలో సైతం ఈ ఊరు ప్రస్తావన ఉందట భీముడు హిడింబిల సంతానం మహాభారతంలో టక్కుటమార విద్యలు ప్రదర్శించిన ఘటోత్కచుడు మయాంగ్లోనే తన తంత్ర విద్య సాధన చేశాడని ఒక కథనం ఉంది దీన్ని ఇక్కడ స్థానికులు చాలా బలంగా నమ్ముతారు మరికొన్ని చారిత్రక కథల్లో కూడా మయాన్ ప్రస్తావన ఉన్నట్లు చెప్తుంటారు. యుద్ద సమయంలో చేతబడి వశీకరణం చేయడం ద్వారా కొన్ని యుద్ధాలను గెలుపొందినట్లు ఇక్కడ కథలుగా చెబుతుంటారు ఈ గ్రామంలో తాంత్రిక విద్యను వంశపార పర్యంగా కొనసాగిస్తున్నారు ప్రతి ఇంటి ముందు జంతువుల కళేబరాలు గుట్టలు గుట్టలుగా పోసి ఉంటాయి ఎవరి ఇంటి ముందు ఎక్కువ కళేబారాలు అంటే డెడ్ బాడీస్ ఉంటే అంత గొప్ప తాంత్రికుడు అన్నది వీళ్ళ లెక్కట అలాగే నరబలి కూడా అత్యంత శక్తివంతమైనదని వాటివల్లే అతీతమైన శక్తులు లభిస్తాయని అపారవిశ్వాసంతో చెబుతుంటారు మనుషులతో పాటు జంతువులను సైతం వశీకరణ చేసుకోవడం వీరి ప్రత్యేకత. ఈ గ్రామం పై అనేక పరిశోధనలు కూడా జరిగాయి ఎన్నో టీంలు ఇక్కడికి వచ్చి పరీక్షలు జరిపారు అయితే అక్కడ ఏమీ లేదని అంత నార్మల్ అన్నది మాత్రం చెప్పలేమని పరిశోధన చేసిన బృందాలు చెప్పడం విశేషం. ఈ గ్రామంలో క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులతో, పరికరాలతో మ్యూజియం కూడా ఉంది వంశపారపర్యంగా ఈ తాంత్రిక కుటుంబాలన్నీ ప్రతి ఏటా అతిపెద్ద ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు ఎప్పటినుండి ఈ ఉత్సవం జరుపుతుంది అనడానికి సరైన ఆధారాలు లేనప్పటికీ ఆ సమయానికి అందరూ ఒకటే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు చేతబడి క్షుద్ర పూజలు వశీకరణతో పాటు కొన్ని రోగాలకు సైతం వైద్యం చేస్తారు ఈ తాంత్రికలంతా నిర్విరామ విద్యార్థులు ఇక్కడ నేర్చుకుంటూ మరికొందరికి నేర్పుతూ ఉంటుంటారు ఈ క్షుద్ర విద్యలకు సంబంధించిన గ్రంథాలు మాత్రం దొరకవు. ఈ విద్యను కేవలం మౌఖికంగా మాత్రమే నేర్చుకోవాలని తమ పూర్వీకులు పెట్టిన కట్టుబాటని గ్రంథాల్లో ఈ విద్యను పొందుపరిస్తే తప్పుడు వ్యక్తులు చేతుల్లోకి ఈ విద్య వెళ్లి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వీరంతా చెప్పడం కోసమెరుపు.