“జనగణమన ” కు బ్రేక్ పడుతుందా..? కసిగా ముందుకెళ్తుందా..?

తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకునే ” జనగణమన ” మూవీ పై లైగర్ ఎఫెక్ట్ పడనుందా… అన్నదే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో తాజా కబర్… జనగణమన పై విజయ్ దేవరకొండ పునరాలోచన లో పడ్డట్టు సన్నిహితుల దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే 30 శాతం టాకీ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయింది. లైగర్ మూవీ షూట్ మధ్యలోనే ” జనగణమన ” మూవీని అనౌన్స్ చేయడం ఆ వెంటనే షూటింగ్ ప్రారంభించడం కూడా జరిగిపోయింది. విజయ్ దేవరకొండ, పూరి ల కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన లైగర్ మూవీ భారీ అంచనాలతో రిలీజయి ప్లాప్ టాక్ మూటకట్టుకుంది.. ఇప్పుడు లైగర్ రిజల్ట్ ప్రభావం విజయ్ దేవరకొండ – పూరి కాంబినేషన్ లో వస్తున్న ” జనగణమన ” మూవీ పై గట్టిగానే పడనుందని చర్చ షురూ అయింది. లైగర్ మూవీకి పెట్టిన పెట్టుబడి కంటే రెండింతలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమా కోసం దర్శకుడు పూరి చాలా మంది హీరోలను అనుకున్నా.. అది వర్కౌట్ అవ్వలేదు. ఏ ముహుర్తాన దేవరకొండ తో కుదిరిందో జనగణమన కు తనే హీరో అని ఫిక్స్ అయ్యాడు.. ఇంకేముంది ఇక ఈ సినిమా కాంబినేషన్ అనౌన్స్ తో క్రేజ్ తో పాటు అంచనాలు కూడా అమాంతం పెరిగాయి.   జనగణమణ సినిమాలో విజయ్ దేవరకొండకు  జంటగా పూజా హేగ్దే నటించబోతున్నట్టు వినికిడి. ఇందులో విజయ్ దేవరకొండ కొత్తగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్  ఇప్పటివరకు కనిపించని ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే లైగర్ ఫలితంతో సంబంధం లేకుండా ఈ సినిమాకు ఖర్చు చేయనున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ తో పాటు వంశీ పైడిపల్లి కూడా నిర్మాతగా మారబోతున్నారు. ఈ మూవీకి కూడా బాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి పని చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ వారితో కలిసి చేసిన లైగర్ మూవీ రిజల్ట్ ఎలా ఉందో ఇప్పటికే అందరికీ తెలిసిన ఈ క్రమంలోనే మరో మారు “జనగణమన” ఎలా ఉంటుందో అన్న లెక్కలు వేసేసుకుంటున్నారు.. మరోసారి పూరి భారీగా ఖర్చుపెట్టి సాహసం చేస్తాడా అనే సందేహాలు కూడా విన వస్తున్నాయి ఇక జనగణమన మూవీ కథ విషయానికి వస్తే కధ వివాదాస్పదంగానే ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో సైనిక పాలన చూపించబోతున్నట్లు ప్రభుత్వం లేనపుడు సైనికులు తమ దేశం కోసం ఏం చేసారు అనే అంశంతో ఈ సినిమా కథ సాగనుందనే సమాచారం. అయితే ఈ సైనిక పాలన అనేది వివాదాస్పద అంశం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు క్రిటిక్స్ అంటున్నారు. సెన్సార్ టైమ్ లో ఎన్ని వివాదాలు ఫేస్ చేస్తుందో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. లైగర్ రిజల్ట్ తో జనగణమన మూవీని పక్కన పెట్టి మరో హీరోతో పూరి సినిమా చేసే అవకాశం ఉన్నట్లు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ నిర్మాణ దశలో ఉంది. లైగర్ రిజల్ట్ మాత్రం పూరి – విజయ్ లను కోలుకోలేని దెబ్బ కొట్టినా నెక్స్ట్ మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే… అది పూరి కి అయిన విజయ్ కి అయినా..

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More