ఎమ్మెల్యే కు టీచర్ ఉద్యోగం..

పాతికేళ్ల క్రితం పరీక్షల్లో పాసైనా పోస్టింగులు దక్కక రకరకాల సమస్యలతో సతమతమైన ఉద్యోగార్ధుల  జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.. డిఎస్సీ 98 అర్హులకు ఎట్టకేలకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో  ఆ లిస్ట్ లో ఎమ్మెల్యే పేరు కూడా ఉంది డాక్టర్‌  కాబోయి యాక్టర్‌ అయిన వాళ్ల కథలు వినే ఉంటాం… కానీ ఉపాధ్యాయుడి అవ్వాలనుకుని, పరీక్షలో పాసైనా, పోస్టింగ్ దక్కక రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే అయిపోయిన కరణం ధర్మశ్రీ కి ఇన్నాళ్లకు ప్రభుత్వోద్యోగం వరించింది డిఎస్సీలో ఎంపికైనా రకరకాల కారణాలతో అది నెరవేరకపోవడంతో రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయిన ఇన్నేళ్ల తర్వాత డిఎస్సీ 1998 అభ్యర్ధులకు మినిమం టైమ్‌ స్కేల్‌ వేతనాలతో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపై టీచర్‌ కాబోయి ఎమ్మెల్యే అయిన ధర్మశ్రీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకున్న ఈ ప్రజా ప్రతినిధి 1998 డిఎస్సీలో ఎంపికయ్యారు.  దాదాపు పాతికేళ్ల క్రితం, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు ధర్మశ్రీ లక్ష్యం ప్రభుత్వోద్యోగంలో స్థిరపడటమే… డిఎస్సీలో ఎంపికవడంతో ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరడమే ఆలశ్యం అనుకున్నా ఉద్యోగ నియమకాలు మాత్రం జరగలేదు. 30ఏళ్ల వయసులో అన్నామలై యూనివర్శిటీ నుంచి బిఇడి పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని భావించినా అది నెరవేరలేదని ఎమ్మెల్యే చెపుతున్నారు. నియామకాలు పెండింగ్‌లో పడటంతో బీఎల్‌ చదివానని  ఆ సమయంలోనే కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి 25ఏళ్లలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, కాంగ్రెస్ పార్టీలో మొదలైన ప్రస్థానం వైసీపీలో ఎమ్మెల్యేగా చేరిందన్నారు. డిఎస్సీ 98లో ఉద్యోగం వస్తే తన జీవితం మరోలా ఉండేదని రాజకీయాల్లోకి ఖచ్చితంగా ప్రవేశించే వాడిని కాదన్నారు. ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చే వాడినని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యమంత్రి చొరవతో ఇన్నేళ్ల తర్వాత సమస్య పరిష్కారం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More