ఆ దేవాలయ రహస్యం అటు చరిత్రకారులకు, ఇటు శాస్త్రవేత్తలకు అంతు పట్టనిదిగానే మిగిలిపోయింది. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు..? ఎవరు..? ఎలా నిర్మించారనే విషయం మాత్రం లెక్కకు తేలడం లేదు.. వందలఏళ్ళు అయిందని కొందరంటే, కాదుకాదు వేల సంవత్సరాల క్రితమే ఈ ఆలయనిర్మాణం జరిగిందని మారుకొందరు చెప్తుంటే ఇది పురాణకాలం నాటి ఆలయమని దీన్ని తరవాతి కాలంలో మార్పులు చేసారాని ఇంకొందరు ముక్తాయిస్తున్నారే తప్పా దీని నిర్మణానికి సంబందిందించి సరైన ఆధారం ఒక్కటి కూడా లేదు. ప్రపంచం లో ఏక రాతితో చెక్కిన అతిపెద్ద పురాతన ఆలయంగా, అద్భుతమైన వాస్తు నిర్మాణంగా పేరుపొందిన ఆ ఆలయమే ఎల్లోరా కైలాసదేవాలయం. ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో కృష్ణ-1 అనే రాష్ట్రకూట చక్రవర్తి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. కానీ కృష్ణ యాజ్ఞవల్కి రచించిన ‘కథా కల్పతరు’ అనే గ్రంథం ప్రకారం చూసుకుంటే ఆ ప్రాంతాన్ని పాలించే ‘ఎలు’ అనే ఒక రాజు ఓసారి తీవ్రమైన అస్వస్థతకి గురవగా, భర్త కోలుకుంటే శివుడికి గుడి కట్టిస్తాననీ, ఆ శిఖరాన్ని చూసేవరకూ ఉపవాసం చేస్తాననీ రాణి మొక్కుకుందట. ఇక రాణి కోరుకున్నట్లే రాజు గారికి ఆ వ్యాధి తగ్గింది. దాంతో ఆ నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలని అనుకున్నారట. పైథాన్ నగరం నుంచి వచ్చిన కోకస అనే ఒక వాస్తుశిల్పి, పర్వతం పై నుంచి కిందకి చెక్కుతూ వస్తే కొద్ది రోజుల్లోనే శిఖరాన్ని నిర్మించవచ్చు అని తెలిపి, అలాగే చేశారు. దాంతో రాణి ఉపవాస దీక్షను విరమించిందనీ అక్కడి కధనాలు చెబుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ఎల్లోరా కైలాస దేవాలయం మాత్రం ఓ ప్రత్యేకం. సహ్యాద్రి పర్వతశ్రేణిలోని చరణాద్రి కొండల్లో ఎల్లోరాలోని 16వ గుహలోని ఏకశిలా నిర్మాణమే ఈ కైలాస దేవాలయం.