అల్లు అరవింద్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూవీ చేస్తున్నట్టు ఆ మధ్య ఒక అనౌన్స్ వచ్చింది. స్వయంగా దర్శక నిర్మాతలే ఈ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఎవరికి వారు తమ సొంత ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమయ్యారు. రెండేళ్లు కావస్తున్న వారు కాంబినేషన్ లో ప్రకటించిన సినిమా ప్రసక్తే కనిపించలేదు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అరవింద్ ను మీడియా ఇదే ప్రశ్న వేసింది. మీ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ ఇక లేనట్టేనా ? అని ప్రశ్నించేసరికి తమ కాంబినేషన్ లో మూవీ ప్రకటన చేయడం వాస్తవమేనని ప్రస్తుతం ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నామని, కచ్చితంగా తమ కాంబినేషన్ లో అయితే మూవీ ఉంటుందని స్పష్టం చేశారు. మొన్ననే బోయపాటిని కలిశానని ఈ విషయంపై చర్చించానని చెప్పారు. కథ ఫైనల్ అయ్యాక తాము మరోసారి కలిసి సినిమాపై చర్చించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కాంబినేషన్ లో వచ్చే మూవీ కోసం ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలను లాక్ చేశానని పేర్కొన్నారు. బోయపాటి చెప్పే కథను బట్టి ఆ ఇద్దరు హీరోలకు ఎవరికి సూట్ అవుతుందో వారితోనే సినిమా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఫైనల్ చేసే హీరోని బట్టి స్క్రిప్ట్ లో కొంచెం మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మీడియా వాళ్ళు తమ కాంబినేషన్ లో మూవీ లేదంటూ చేస్తున్న ప్రచార అవాస్తవమని అన్నారు. కచ్చితంగా మూవీ అయితే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అల్లు అరవింద్ లాక్ చేసిన ఆ స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ లే అయ్యుంటారని సినీ అభిమానులు భావిస్తున్నారు. బోయపాటి బాలకృష్ణ తో హ్యాట్రిక్ సీట్లు కొట్టారు. అల్లు అర్జున్ తో సరైనోడు మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోలతో పనిచేయడం బోయపాటికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. వీరిద్దరి హీరోలతో సినిమా అంటేనే మంచి హైప్ క్రియేట్ అవుతుంది. అల్లు అరవింద్ అందుకే ఈ ఇద్దరు హీరోలతో ఒక మాట చెవిన పడేసి ఉంచాడు. ప్రస్తుతం అయితే బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా తోను, అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ పుష్ప మూవీ తోను బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది బోయపాటి, అల్లు అరవింద్ కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
previous post