Vaisaakhi – Pakka Infotainment

తెలుగు ప్రేక్షకులతో నాకు కనెక్షన్ ఏర్పడింది.. ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఆలియా

ఆలియా భ‌ట్, వేదాంగ్ రైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘జిగ్రా’ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియ‌న్ సురేష్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద్వారా రానా విడుద‌ల చేస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు విడుద‌ల చేసిన జిగ్రా తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రానా దగ్గుబాటి, సమంతలు ముఖ్య అథితులుగా విచ్చేశారు. త్రివిక్రమ్, సమంత చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో.. ఆలియా భట్ మాట్లాడుతూ.. ‘నేను మెసెజ్ చేసిన వెంటనే వచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మీరు మాట్లాడిన ప్రతీ మాట గుండెల్ని తాకింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో సమంత రియల్ హీరో. సమంత తన నటనతో సినిమా పరిశ్రమలో నిలబడ్డారు. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఈ చిత్రంతో వస్తున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడింది. నాటు నాటు పాటను నా కూతురు రాహా ఎప్పుడూ వింటూనే ఉంటుంది. మంచి చిత్రాన్ని ప్రేమించడం, ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే నా గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేశాం. జిగ్రా కోసం వాసన్ బాలాతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఇంకా చాలా గొప్ప చిత్రాలను చేయాలి.. అందులో నాతో కొన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. వేదాంగ్ ఈ మూవీతో స్టార్ అయిపోతాడు. రియల్ లైఫ్‌లోనూ నా బ్రదర్, ఫ్రెండ్‌లా అయిపోయాడు. రాహుల్‌ ఈ చిత్రంలో ఓ కీ రూల్‌ను పోషించాడు. రాహుల్‌కు సినిమా అంటే పిచ్చి. రాహుల్, వాసన్ ఇద్దరూ సెట్స్‌లో సినిమా గురించే మాట్లాడుకునేవారు. మా సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్న రానాకి థాంక్స్. అక్టోబర్ 11న మా చిత్రం రాబోతోంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఇలా అన్నీ ఉన్న ఓ ఇంటెన్స్ సినిమా. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More