Vaisaakhi – Pakka Infotainment

అంచనాలు పెంచేసిన ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్

ఆదిపురుష్ చిత్రం ఫైనల్ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసిన మూవీ ఫైనల్ ట్రైలర్ కోసమే చర్చ నడుస్తుంది. ఫైనల్ ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో గూస్ బంప్స్ తెప్పిచ్చే విధంగా అద్భుతంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటుంది. రావణుడికి భిక్షం వేసేందుకు సీతాదేవి లక్ష్మణ రేఖ దాటగానే ఆమెను అపహరించుకునే వెళ్లే సీన్‌తో ప్రారంభమైన ట్రైలర్ వానర సేన పోరాటం, హనుమంతుడి సాయం, రాముడి పరాక్రమాన్ని, దుష్ట రావణుడి అంతాన్ని చూపిస్తూ ఫైనల్ ట్రైలర్‌ను ఆసక్తిని పంచేలా కట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందనడంలో సందేహమే లేదు. ఇక ఫైనల్ ట్రైలర్ తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ట్రైలర్ లో పలు డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. “వస్తున్నా రావణ. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచి వేయడానికి. వస్తున్నా నా జానకిని తీసుకెళ్లడానికి” “నా ఆగమనం.. అధర్మ విద్వంసం” “ఈ రోజు నా కోసం పోరాడొద్దు. భరతఖండంలో పర స్త్రీ మీద చేయి వేయాలనే దుష్టులకు మీ పాపా పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టాలి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి” “తను ఇంటి గుమ్మంలో నుంచి ఎత్తుకువచ్చాడు. జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చే ది రాఘవ తీసుకెళ్లినప్పుడే.. ఆయనే వస్తాడు” “నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ.. నీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశుడనై ఉన్నాను” “పాపం ఎంత బలమైనదైనా అంతిమ విజయం సత్యానిదే” ఇలా సెకండ్ ట్రైలర్లో డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా కృతిసనన్ సీతగా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చయింది. ఇక ఇప్పటికే ప్రొడ్యూసర్లకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రూపంలో మొత్తం ముట్టాయని తెలుస్తుంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో బాక్సాఫీస్ ప్రభాస్ నటించిన సినిమాలేవి అంతగా ప్రభావం చూపించలేదు. అయితే ఆది పురుష్ సినిమా మాత్రం బాహుబలి రికార్డులను తిరగరాస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఊహించని స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈసారి నార్త్ ఇండియా లోనే 1000 కోట్లు కలెక్ట్ చేస్తే దమ్మున్న సినిమా అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అయితే 12 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More