Vaisaakhi – Pakka Infotainment

ఆది పురుష్ ను బ్యాన్ చేయాల్సిందేనా..?

ఆది పురుష్ సినిమాపై వివాదం ఇప్పట్లో తేలేలా లేదు.. శ్రీరాముడు పై రామాయణం పై ప్రజలకు ఉన్న నమ్మక విధ్వంసం పై విరుచుకు పడుతున్నారు. దర్శక నిర్మాతలపై పోలీస్ కేసు నమోదు చేసి ఆ సినిమాను అన్నిచోట్ల బ్యాన్ చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో సౌత్ సినిమాల నుంచి బాలీవుడ్ ని కాపాడాలంటూ విస్తృత ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు.ముఖ్యంగా బాలీవుడ్ మేజర్ మార్కెట్ ని టాలీవుడ్ సినిమాలు కొల్లగొట్టడం జీర్ణించుకోలేని కొందరు అదేపనిగా హీరో ప్రభాస్ ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. బాధ్యతారాహిత్యం గా సినిమా తీసిన బాలీవుడ్ దర్శక నిర్మాతలను వదిలేసి సౌత్ సినిమాలను బ్యాన్ చేయాలి. ప్రభాస్ సినిమాలను ఇక్కడ విడుదల చేయకూడదు. అంటూ కొత్త వివాదానికి తెర లేపారు. అంతే కాకుండా ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగులు రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఈ సినిమా హిందువుల మనోభావాలను, సనాతన ధర్మాన్నీ తీవ్రంగా దెబ్బతీసేలా ఉందని, శ్రీరాముడు అందరికీ దేవుడని తెలిపింది. ఈ సినిమాలోని డైలాగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధపెట్టేలా ఉన్నాయని, దేవుళ్లను వీడియో గేమ్‌లలో పాత్రల్లాగా చిత్రీకరించారని ఆరోపించింది. భారతీయ సినిమా చరిత్రలో ఇంతటి అవమానకరమైన చిత్రం భాగం కాకూడదని, శ్రీరాముడిపై, రామాయణంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ సినిమా పూర్తిగా విధ్వంసం చేసిందని దుయ్యబట్టింది. దీనిని వెంటనే నిలివేయాలని అలాగే భవిష్యత్తులో ఓటీటీలో కూడా దీనిని ప్రదర్శించవద్దని, ఈ మేరకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నామని ప్రధానమంత్రి కి ఆ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా ‘ఆదిపురుష్‌’ దర్శకుడు, రైటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ప్రత్యేకంగా ఒక మతానికి చెందిన వారు రామాయణాన్ని, అలాగే ప్రభాస్ ను దారుణంగా టోల్ చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న సరే సినిమాకు కలెక్షన్లు వస్తూ ఉండటం పై యాంటీ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. టాక్ తో సంబందం లేకుండా 400 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా వచ్చే ఆదివారం నాటికి పూర్తి పెట్టుబడిని రాబట్టు కోవడమే కాకుండా మరికొన్ని లాభాలను ఆర్జించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఎంత నెగిటివ్ ప్రచారం చేసిన సినిమాకు ఊహించని విధంగా కలెక్షన్లు వస్తూ ఉండటంపై జీర్ణించుకోలేని కొందరు నార్త్ ఆడియన్స్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రామాయణ కథను అవమానకరంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ ఈ సినిమాని నిలుపుదల చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి.. సినిమా క్లైమాక్స్ సీన్ లో రాముడు ఎంత ప్రతిఘటించిన రావణుడిదే పై చేయి అవుతూ ఉంటుంది. ఇక రావణుడి చేతిలో రాముడు ఘోరంగా ఓటమి చెందుతాడనే సమయంలో హనుమంతుడు వచ్చి రాముని కాపాడుతాడు. దర్శకుడు కి రాముడు క్యారెక్టర్ ఇష్టమా తెలియదు లేదా ఆ క్యారెక్టర్ చేసిన సైఫ్ ఆలీ ఖాన్ అంటే ఇష్టమో తెలియదు. రావణుడు కనిపించే కనిపించి ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు బాగా హైలైట్ చేయడానికి ప్రయత్నించాడు. రాముడు క్యారెక్టర్ పై మాత్రం కాన్సన్ట్రేషన్ చేయలేదు. రాముడు గెటప్ నుంచి రాముడు కనిపించే ప్రధాన సన్నివేశాల వరకు చాలా అవమానకరంగా దర్శకుడు చూపించిన వైనం ఇప్పుడు అందరికీ కోపాన్ని రప్పిస్తుంది. అలాగే అక్కడ కొందరు దర్శక, నిర్మాతలు తీస్తున్న చిత్రాలకు పెట్టిన పెట్టుబడి రాక డీలా పడుతున్నారు. అక్కడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూస్తున్నాయి. దీంతో కావాలనే టాలీవుడ్ హీరోలను, సినిమాలను అక్కడ వారు టార్గెట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఆదిపురుష్ మూవీపై పడ్డారు. సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయాలు పేరున రచ్చ చేస్తున్నారు. అమీర్ ఖాన్ తీసిన పీకే సినిమాలో హిందూ దేవుళ్లను చాలా అవమానకరంగా చూపించారు. అప్పుడు కనిపించని సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు ఈ సినిమాకు మాత్రమే కనిపించడం ఒక కుట్రలా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. పీకే సినిమా మాత్రమే కాదు గతంలో వచ్చిన పలు బాలీవుడ్ సినిమాలు హిందూ మతానికి వ్యతిరేకంగా, హిందూ దేవుళ్లను అవమానకరంగా చూపిస్తూ ఎన్నో వచ్చాయి. అప్పుడు వీరంతా ఎక్కడికి వెళ్లారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ హీరో కాకుండా బాలీవుడ్ హీరో ఎవరన్నా చేసి ఉంటే మాత్రం ఇంత రాద్ధాంతం కూడా జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఏదైనప్పటికీ దర్శక నిర్మాతలు ఈ సినిమా విషయంలో చేసిన తప్పు కూడా ఉంది. తమ వెర్రితనంతో ప్రభాస్ కెరీర్ ను నాశనం చేయడానికి ప్రభాస్ తో ఈ సినిమా తీశారని అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ గొడవ అదిపురుష్ సినిమా నుంచి బాలీవుడ్ – సౌత్ సినిమాల గొడవగా మారింది. బాలీవుడ్ లో షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ వంటి టాప్ స్టార్ల సినిమాలకు కలెక్షన్ లు రాకపోవడానికి కారణం సౌత్ సినిమాలనే అక్కడి వారు అభిప్రాయపడుతున్నారు. సేవ్ బాలీవుడ్ పేరుతో వాట్సప్ గ్రూపులను, ఫేస్బుక్ గ్రూపులను అలాగే ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికగా సౌత్ సినిమాల నుంచి బాలీవుడ్ ను రక్షించుకుందాం అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించారు. యాంటీ ఫ్యాన్స్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టాలీవుడ్ హీరోల ను కట్టడి చేయడం అన్నది అసాధ్యమనే తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప -2, ప్రభాస్ సలార్ సినిమాలు బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించే సినిమాలుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఆది పురుష్ సినిమా పై నార్త్ బెల్ట్ కోపంతో ఉంది. ఈ సినిమా బ్యాన్ చేయాలని గట్టిగా పట్టు పట్టింది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More