Vaisaakhi – Pakka Infotainment

ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే రోల్స్ చెయ్యాలనుంది.-హీరోయిన్ మోక్ష

ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే క్యారెక్టర్స్ చేయాలని వుందని హీరోయిన్ మోక్ష అన్నారు. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం లో హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ మోక్ష విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలతో పాటు పలు అంశాలను పంచుకున్నారు.

కోల్‌కాతా నుంచి వచ్చిన బెంగాలీ అమ్మాయిని లక్కీ లక్ష్మణ్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమయినట్టు తెలిపారు. అలనాటి రామచంద్రుడు తన రెండో సినిమా అని గత రెండేళ్ళుగా తెలుగు మలయాళం తమిళ పరిశ్రమల్లో పని చేస్తున్నాను. తెలుగు అర్ధం అవుతుంది. మాట్లాడటం కూడా చాలా వరకూ వచ్చింది. అలనాటి రామచంద్రుడు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. అలనాటి రామచంద్రుడు లో తన నా క్యారెక్టర్ పేరు ధరణి అని ఇదొక కమర్షియల్ పోయిటిక్ మూవీ. ట్రైలర్ చూస్తే బ్యూటీఫుల్ పోయిట్రీ వుంటుంది. నా క్యారెక్టర్ చాలా హైపర్, అల్లరిగా వుంటుంది, దర్శకుడు ఏం చెప్పారో అదే అద్భుతంగా ప్రజెంట్ చేశారు. చాలా బ్యూటీఫుల్ క్యారెక్టరైజేషన్, ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకునేలా వుంటుంది.ఈ సినిమాలో నాకు చాలా మంచి డైలాగులు వున్నాయన్నారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా మనాలిలో వుంటుంది. షూటింగ్ లో చాలా ఛాలెంజ్స్ ఎదురుకున్నాం. వింటర్ లో మైనస్ డిగ్రీలలో షూటింగ్ చేశాం. ఈ కథలో నేచర్ ఒక ఫీలాసఫీ గా వుంటుంది, ఆ నేచర్ క్యాప్చర్ చేయడం సవాల్ గా అనిపించింది. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఈ పాత్ర నా కోసమే పుట్టిందేమో అనిపించింది. నా ఆడిషన్ ఆయనకి నచ్చింది. దిని కోసం వర్క్ షాప్ కూడా చేశాం. చాలా హానెస్ట్ గా కష్టపడి తీసిన సినిమా ఇది.అలనాటి రామచంద్రుడు టైటిల్ ఇందులో హీరో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే టైటిల్ ఇది. ఇందులో తనది స్వార్ధం లేని ప్రేమ. ప్రజెంట్ జనరేషన్ లో శ్రీరాముని క్యారెక్టర్ తో హీరో క్యారెక్టర్ ని కోరిలేట్ చేసుకునేలా వుంటుంది. ఇదొక క్లాసిక్ యూనివర్సల్ లవ్ స్టొరీ. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా కథకు కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఒక పెద్ద సినిమాలానే చేశారు. వారికి హ్యాట్సప్ చెప్పాలి. చాలా విజనరీ ప్రొడ్యూసర్స్. మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. నేపధ్యం సంగీతం అన్ బిలివబుల్ అనిపిస్తుంది. సరికొత్త మ్యూజిక్ ని ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు.
తెలుగు సినిమాలు చూస్తుంటారా ? అన్న ప్రశ్న కు సమాధానమిస్తూ తెలుగు సినిమాలు చూశాను. సావిత్రి గారు చేసిన దేవదాస్ నుంచి అనుష్క గారి అరుంధతి, లేటెస్ట్ సాయి పల్లవి గారి విరాట పర్వం వరకూ ఎన్నో సినిమాలని ఎంజాయ్ చేశాను. సీతారామం, హనుమాన్ ఎంతగానో నచ్చాయి. అందరూ ఇష్టమే. నాని గారు అంటే ఇష్టం, ఆయన శ్యామ్ సింగారాయ్ లో బెంగాల్ నేపధ్యం వుంటుంది. ఆయనతో వర్క్ చేయాలని వుంది. తెలుగు పాన్ ఇండియా ఇండస్ట్రీ. ఇక్కడ ఆడియన్స్ చాలా లవబుల్ గా వుంటారు. ప్రమోషన్స్ లో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు ఈ సినీమా తరువాత సముద్రఖని ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న రామం రాఘవం సినిమా చేస్తున్నాను. అలాగే ఒక మలయాళం సినిమా కూడా విడుదలకు రెడీ అవుతుందని చెప్పారు హిరోయిన్ మోక్ష.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More