పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్తా మీనన్ లీడ్ రోల్ లో నటిస్తూ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ రియలిస్టిక్ మూవీకి యోగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంతమంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చిన ఈవెంట్ ఇదే అనుకోవచ్చు. సంయుక్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, హీరో రానా, దర్శకులు వశిష్ట, వెంకీ కుడుముల, రామ్ అబ్బరాజు, రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కెరీర్ లో ఈ సినిమా ఎంతో స్పెషల్ కానుంది.