బొమ్మ బొరుసా పతాకంపై విస్కి దర్శకత్వంలో రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ది బర్త్‌డే బాయ్. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు మోహర్ రమేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం కొత్తగా వుంటుంది. ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఐదుగురు స్నేహితులకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యవసానాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి. ఈ సినిమా సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండబోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించాం. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుందన్నారు