జూలైలో థియేట్రికల్ రిలీజ్ కు రానున్న విజయ్ ఆంథోనీ”తుఫాన్” ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆసక్తికరంగా సాగిన టీజర్ లో ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ గా ట్రైలర్ లో చెప్పారు. తనకు ఎవరూ తెలియని ఓ ప్రాంతంలోకి వెళ్లి ఎవరూ తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు హీరో విజయ్ ఆంటోనీ. అతన్ని తన చీఫ్ శరత్ కుమార్ గైడ్ చేస్తుంటాడు. హీరోను ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు పోలీస్ అధికారి మురళీ శర్మ…హీరో కోసం వేట సాగిస్తుంటాడు. ఇంతకీ ఎవరి గతంలోలేని హీరో గతమేంటి, అతని కోసం పోలీసు వేట ఎందుకు సాగుతోంది. కొత్త ప్రాంతంలో తనను ఆదరించిన కుటుంబం కోసం హీరో ఏం చేశాడు అనేది ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ లొకేషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు, విజయ్ ఆంటోనీ ఇంటెన్స్, ఎమోషనల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఇప్పటికే “తుఫాన్” సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కూడా ఇన్ స్టంట్ గా ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ఆసక్తికరంగా ఉంది.
previous post
next post