ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. (LOVE) ని రివర్స్లో చూస్తే EVOL అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్ – డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి
ఎవోల్EVOL. (a love story in reverse )* డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి పాల్గొని మాట్లాడుతూ
ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్, నేపథ్యంలో సాగే కథ అని. సినిమా డిఫరెంట్ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్ థ్రిల్లర్‌గా. రూపొందిందని ఆధ్యంతం ఉత్కంఠగా సాగే సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ తో విడుదల కు సిద్ధమైందన్నారు.
previous post