Vaisaakhi – Pakka Infotainment

ఎంటైర్ కెరీర్ లో మొట్ట మొదటిసారిగా…

తెలుగు సినిమాను ఆర్జీవీ కి ముందు తరువాత అని విభజించి చెప్పేలా ఫిల్మ్ మేకింగ్ విధానాన్నే కంప్లీట్ గా చేంజ్ చేసేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ను ఫాస్ట్ గా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కించడం లో ఆర్జీవీ నుంచి పర్ఫెక్ట్ గా నేర్చుకున్న వ్యక్తి పూరి జగన్నాథ్ ఫిల్మ్ ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్.. సక్సెస్ మీట్ ఎప్పుడు..? ఎక్కడా..? అని అంచనా వేసుకుని ప్లాన్ చేసుకునే డైరెక్టర్ పూరి ఒక్కడే… అయితే ఇదంతా గతం..! ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ వరుస ఫ్లాప్ లతో భారీ డిజాస్టర్ లతో ఇండస్ట్రీ నుంచి కొత్తగా పాఠాలు నేర్చుకుంటున్న డైరెక్టర్.. ఎంటైర్ కెరీర్ లో ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో… క్లారిటీ లేని పరిస్థితి… గతంలో ఎప్పుడు జరగని విధంగా నాలుగైదు సార్లు రిలీజ్ డేట్స్ మార్చుకోవడం అతిపెద్ద మార్పు కి నిదర్శనం. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలోనైనా ఓడలు బండ్లు అవ్వడం బండ్లు ఓడలు కావడం కామన్.. ఎంతటి స్టార్ హీరో అయినా సరే వాళ్ళ కెరీర్ లో ఒక్కసారైనా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎక్ట్ చేయాలని తాపత్రయ పడుతూ వుండేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోగా పూరి కధ చెప్తానంటే తప్పించుకునే హీరో లే ఎక్కువ. ఇప్పుడు పూరి జగన్నాథ్ రామ్ తో ప్రస్తుతం చెస్తున్న డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చాలాకాలం నుంచి జరుగుతావుంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికి రిలీజ్ కి మాత్రం మోక్షం కలగలేదు.. సంతృప్తి కరమైన బిజినెస్ కూడా కాలేదని సమాచారం. అందుకే రిలీజ్ విషయం లో ఎప్పుడూ లేనంత గజిబిజి ఉందని ఫిల్మ్ నగర్ టాక్.. కొత్త తరం రాకతో ఏది హిట్టవుతుందో ఏది ఫట్టావుతుందో తెలియనంత గందరగోళ పరిస్థితుల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న నేపథ్యంలో డబల్ ఇస్మార్ట్ ఎంత మేరకు పూరి ని గట్టెక్కిస్తుందో తెలియదు.. ఇక ఈ ప్రాజెక్ట్ తరువాత నాగార్జున కన్నడ స్టార్ హీరో యష్ ని పూరి లైన్ లో పెట్టినట్టు జరుగుతున్న ప్రచారం కూడా ఇస్మార్ట్ రియాల్టీ పైనే ఆధారపడి ఉంటుంది. . కన్నడ స్టార్ యశ్ తో ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసిన పూరి కి వీళ్లిద్దరిలో ఎవరు డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయిన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి ఒక లవ్ స్టోరీని మొదలెట్టేయాలన్నది ప్లాన్. ఇడియట్ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేసిందో ఆకాష్ తో చేయబోయే సినిమా కూడా అదే మ్యాజిక్ చేయబోతోందటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. లైగర్ భారీ డిజాస్టర్ హీరో పై పెద్ద గా ప్రభావం చూపకపోయినా దర్శకుడి పై దారుణమైన ఎఫెక్ట్ చూపించింది.. నిజాలు మాట్లాడుకోవాలంటే డబల్ ఇస్మార్ట్ కరుణిస్తే తప్పా కొడుకు తోనైన మరో హీరోతో నైనా లేకపోతే మళ్ళీ లాంగ్ గ్యాప్ కంపల్సరీ.. ఒక హీరో కాకపోతే మరో హీరో తో వరుసపెట్టి సినిమా లు తీసుకుని వెళ్లిపోయే పూరి ఈసారి మాత్రం హీరో డేట్స్ కోసం ఎదురుచూడాల్సిందే.. ఇంట్రస్టింగ్ మ్యుజింగ్స్ చెప్పే పూరి తన అప్డేట్ ని కూడా ఓ నీతి కథలా చెప్పుకోవాలి.. ఏదైనా అన్నిటికీ ఆన్సర్ చెప్పే కాలం చాలా విలువైనది కూడా.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More