సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ ప్రధాన తారాగణం గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై నిహారిక కొణిదెల సమర్పణలో ‘ పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మాతలుగా ఎదు వంశీ దర్శకత్వం లో రూపొందించిన ‘కమిటీ కుర్రోళ్ళు ‘ టీజర్‌ను చిత్ర సమర్పకురాలు నిహారిక కొణిదల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ మేమంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తీశాం. త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతోంది. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. వంశీ గారు కథను నెరేట్ చేసినప్పుడు పదకొండు మంది జీవితాల్నిచూసినట్టుగా అనిపించింది. మ్యూజిక్‌తో పాటుగా కథను నెరేట్ చేశారు. అప్పుడే మాకు విజువల్‌గా సినిమా ఎలా ఉంటుందో అర్థమైంది. నాకు కథతో పాటు ఆయన నెరేట్ చేసిన విధానం నచ్చింది. ఎన్నో ఎమోషన్స్ అందరికీ టచ్ అవుతుంటాయి. ప్రతీ ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా ఎమోషన్స్‌తో వెళ్లాడు. ఊర్లో ఉండే ప్రతీ ఒక సంఘటన ఇందులో ఉంటుంది. ఊర్లో గొడవలు, రాజకీయాలు, ఆడే ఆటలు అన్నీ ఉంటాయి. పదకొండు మంది జీవితాలను చూపించబోతోన్నాం. 8 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వాళ్ల వాళ్ల జీవితాల్లో ఏం జరిగిందో చూపించబోతోన్నాం. ఎవరో ఒకరు ఏదో ఒక కారెక్టర్‌కు కచ్చితంగా కనెక్ట్ అవుతారు’ అని అన్నారు.దర్శకుడు ఎదు వంశీ మాట్లాడుతూ.. ‘ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పక్షులకు ఓ గూటిలా.. నిహారిక గారు మా అందరికీ ఓ చోటు ఇచ్చారు. నా డైరెక్షన్ టీం నాతోనే ఉన్నారు.. ఆరువేల మంది ఆడిషన్స్ తరువాత 11 మందిని సెలెక్ట్ చేస్తే.. వారు కూడా నాతో ఉన్నారు.. ఎన్నో ప్రొడక్షన్ సంస్థల చుట్టూ తిరిగాను. చిన్న బడ్జెట్‌తోనే తీస్తాను అని నిహారిక గారితో చెప్పాను. రమేష్ గారు చేసిన సపోర్ట్‌తోనే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ చిత్రంతో 11 మంది గొప్ప ఆర్టిస్టులను పరిచయం చేయబోతోన్నామన్నారు.నిర్మాత ఫణి అడపాక మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ కెమెరామెన్ రాజు ,ఎడిటర్ అన్వర్ అలీ ,రచయితలు కొండల్ రావు, వెంకట్ సుభాష్ ’ అని అన్నారు.లిరిసిస్ట్ సింహా,ఫైట్ మాస్టర్ విజయ్, తదితరులు ప్రసంగించారు.
previous post