సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి సముద్ర తాజాగా రవి జంగు హీరోగా ప్రీతి కొంగన హీరోయిన్ గా శివమహాతేజ ఫిలిమ్స్, వి.సముద్ర మూవీస్ బ్యానర్లు పై విజయలక్ష్మీ సమర్పణలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మాతగా “వరదరాజు గోవిందం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కు సిద్ధం అవుతుండగా టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో సుమన్, నటుడు శుభలేఖ సుధాకర్, హీరో రవి జంగు, హీరోయిన్ ప్రీతి కొంగన, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహరావు, ముప్పలనేని శివ, చంద్రమహేష్, రవికుమార్ చౌదరి, శివనాగు, నగేష్ నారదాసి, గోసంగి సుబ్బారావు, అమ్మరాజశేఖర్ నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, ఛాంబర్ కార్యదర్శి కె.యల్. దామోదర ప్రసాద్, నిర్మాతలు కేకే రాధామోహన్, డిఎస్ రావు, శోభారాణి, నటులు దాసన్న, ఖదీర్, జోహార్, సంగీత దర్శకుడు డా. రవి శంకర్, కెమెరామెన్ శ్రీ వెంకట్, కో-ప్రొడ్యూసర్స్ శ్రీహరి తుమ్మెటి, జింఖాన కోటేశ్వరావు, తదితరులు హాజరై ప్రసంగించారు. సినిమా హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరు సముద్ర మీద ప్రేమతో వచ్చారు. అందరూ కాంతారా, హనుమాన్ తరహాలోనే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి ఆకాంక్షించారు.
previous post
next post