Vaisaakhi – Pakka Infotainment

పేరుకే ఫ్యాన్ వార్…

మా హీరో గొప్ప.. మా హీరో గొప్ప.. అత్యధిక కలెక్షన్లు మావే.. ఎక్కువ రోజులు ఆడిన సినిమా మాది..ఎక్కువ మంది ఫ్యాన్ బేస్ ఉన్న హీరో మా వాడే..
గత కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న మాటలు ఇవి.. నేటికి కూడా సినీ హీరోల అభిమానుల మధ్య వినిపిస్తూనే ఉన్నాయి. సినిమా ఎన్ని రోజులు.. ఎన్ని సెంటర్లు ఆడింది అన్నది అప్పటి లెక్క. సినిమా ఎంత కలెక్ట్ చేసింది. వసూలులో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసింది అనేది ఇప్పటి లెక్క. గతంలో ప్రతి చిన్న హీరోకు కూడా ఫాన్ ఫాలోయింగ్ ఎక్కడికక్కడ అసోసియేషన్లు కూడా ఉండేవి. అయితే రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా పాన్ ఇండియన్ స్థాయికి కి వెళ్ళి జాతీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్ వాల్యూ ని పెంచుకుంది బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఇండియన్ సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లిన ఘనత మాత్రం రాజమౌళిదే.
ఊహించని స్థాయిలో తెలుగు పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో టాలీవుడ్ హీరోలు తమ మార్కెట్ ను విస్తరించుకునేందుకు పాన్ ఇండియన్ సినిమాల బాట పట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకు మా హీరో ..మీ హీరో అని వాదులాడుకున్న అభిమానులు అందరూ కూడా
తెలుగు హీరో పాన్ ఇండియన్ రేంజ్ లో హిట్ కొట్టి తెలుగువాళ్ళకి పేరు తీసుకురావాలనే కోరుకునే పరిస్థితి ఏర్పడింది. హీరో ఎవరైనా పర్వాలేదు అన్ని భాషలలో తెలుగు సినిమా దమ్ము ఏంటో చూపించి భారీ కలెక్షన్లు వసూలు చేయాలని ఆశిస్తున్నారు.
కార్తికేయ-2, మేజర్
వంటి చిన్న సినిమాల కు కూడా అందరి హీరోల అభిమానులు చాలా సపోర్ట్ చేశారు.
ఆ సినిమాలో కూడా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించాయి.
అయితే నందమూరి ,మెగా కాంపౌండ్ల మధ్య మాత్రం వార్ మాత్రం చాపకింద నీరు లా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు మధ్య పోటీ ఎక్కువగా ఉంది.
చాలావరకు చిరంజీవి పై చేయి సాధిస్తున్నప్పటికీ
అతనికి గట్టి పోటీ ఇస్తుంది మాత్రం బాలకృష్ణే.
అన్ స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణకు మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. అతనిని అందరి హీరోలు అభిమానించడం మొదలుపెట్టారు.
అయితే ఈ షో వల్ల రామ్ చరణ్ – బాలకృష్ణ ల మధ్య మరింత బంధం బలపడి
రామ్ చరణ్ అంటే బాలకృష్ణకు ప్రత్యేకమైన అభిమానం కూడా ఏర్పడింది. అలాగే
ఈ షోకు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ కూడా హాజరయి అప్పటివరకు బాలకృష్ణ – పవన్ మధ్య ఉన్న వివాదానికి పూర్తిస్థాయిలో తెరదించారు.
కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో మెగా హీరోలను బాలకృష్ణ అభినందించడం కూడా జరిగింది.
అలాగే చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ నందమూరి హీరోలను ప్రశంసించడం కూడా జరిగింది. చాలావరకు ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అగాధానికి తెరపడింది.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీటింగ్లలో కూడా
ఇతర సినీ హీరోల కోసం గొప్పగా చెపుతూ బాలకృష్ణని కూడా ప్రశంసించారు. ఇప్పుడు బాలక్రిష్ణ తో పాటు పవన్ కళ్యాణ్ సహచర ఎమ్మెల్యే గా అసెంబ్లీలోకి కూడా అడుగు పెట్టారు.
ఇది చాలా మంచి వాతావరణమే.
కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది అంటే
బాలకృష్ణ – చిరంజీవిల సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయినప్పుడు మళ్లీ అభిమానుల మధ్య వార్ పునరావృతం అవుతుందనే చెప్పాలి.
నిజానికి టాలీవుడ్ చివరి సూపర్ స్టార్ చిరంజీవి మాత్రమే అనేది వాస్తవం.
మిగతా వాళ్ళు ఎందరు ఉన్న వాళ్లు స్టార్లు గానే పరిగణించబడతారు. ఇప్పుడు సినిమాలు పాన్ ఇండియన్ రేంజ్ లో ఆడుతుండడంతో
నంబర్ వన్ ఎవరో అనే గొడవ ప్రాంతీయ చిత్రాల నుంచి ఇండియన్ సినిమా వరకు వెళ్ళింది.
ప్రస్తుతం అయితే షారుఖ్ ఖాన్ – ప్రభాస్ ల మధ్య ఇండియన్ నెంబర్ వన్ హీరో ఎవరు అనేది రచ్చ జరుగుతుంది. ఎవరు అవునన్న కాదన్న ఒకే ఒక పాన్ ఇండియా హీరో ప్రభాస్ మాత్రమే రాబోవు కల్కి దాన్ని మరోసారి కన్ఫర్మ్ చేయబోతోంది.
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఎదురెళ్లి గట్టి పోటీ ఇచ్చే హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే అది వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ అని చెప్పవచ్చు.
అఖండ, వీర సింహారెడ్డి వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాలను కూడా మంచి డైరెక్టర్లతో లైన్ లో పెట్టారు. అలాగే చిరంజీవి కూడా మంచి హిట్ లతో దూసుకుపోతున్న ఈ సీనియర్ హీరోల మధ్య మంచి అనుబంధమే ఉంది.
ఎదురుపడితే చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు.
ఒకరు సినిమా హిట్ కావాలని మరొకరు కోరుకుంటారు. మరి ఎందుకు వీరి సినిమాలు మధ్య పోటీ ఉంటుంది అంటే సినిమాను బతికించడం కోసం, నిర్మాతలకు నష్టం రాకుండా ఉండటం కోసమే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కరోనా తర్వాత సుమారుగా రెండేళ్లు సినిమా థియేటర్లన్నీ మూత పడ్డాయి.
ఆ సమయంలో చాలామంది ఓటీటీలకు అలవాటు పడ్డారు.
ఎంత పెద్ద హీరో సినిమా అయినా థియేటర్ కి వెళ్లి చూడటం ప్రహసంగానే భావిస్తున్నారు.
దీనికి చూడు పెరిగిన టికెట్ ధరలు అక్కడ స్నాక్స్ దారులు కలిసి 1000 నుంచి 3000 వరకు ఖర్చు అవుతూ ఉండటంతో ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలను చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
పెద్ద హీరోల సినిమాలైతే చూడాలని థియేటర్ కు వస్తున్నారు.
ఆ సినిమా కూడా బాలేదని టాక్ వస్తే రెండో ఆటకే థియేటర్ లు అన్ని ఖాళీ అవుతున్నాయి.
దీంతో తెలుగు సినిమా భారీగా నష్టపోతూ ఉంది.
జనాలను థియేటర్లకు కచ్చితంగా రప్పించాలి అంటే.
పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి థియేటర్లో పడాలి.
అభిమానుల మధ్య రచ్చ జరగాలి
మా హీరో తోపు, మా హీరో తురుం అనే వాదనలుండాలి..
ఆ సమయంలో తమ హీరోలు సినిమాలు బాగా ఆడాలని, ఎక్కువ కలెక్షన్ లు రావాలని హీరోల అభిమానులు చూసిన సరే మళ్లీ ఆ సినిమా చూసేందుకు వెళుతూ ఉంటారు.
మూడు రోజులలో సినిమా పని అయిపోయింది అనుకునే సమయంలో రికార్డుల కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తు మూడు రోజుల సినిమా వారం రోజులు దాటించడం జరుగుతుంది.
అంటే సినిమాను బతికించడం కోసం హీరోలు తన సినిమా వేరే హీరోల సినిమాల రికార్డులను కొడుతుందని బాహటంగానే చెబుతారు. అభిమానులను రెచ్చ కొడతారు. హీరోలు అనుకున్నట్లుగానే ఆ సినిమాలు థియేటర్లలో బాగా రన్ అవుతాయి.
అది పెద్ద హీరోల వరకు అయితే మాత్రమే ఈ ప్రయత్నం ఫలిస్తుంది.
ముఖ్యంగా బాలకృష్ణ- చిరంజీవి సినిమాలకు ఇది వర్తిస్తుంది.
ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఎంత హడావిడి ఉంటుందో. చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు ఒకేసారి విడుదల అయితే అంతే హడావుడి, రచ్చ ఉంటుంది.
ఏదైనా సరే సీనియర్ హీరోలుగా తెలుగు సినిమాను బ్రతికించాలనే తపన వారిద్దరిలోను ఉంది.
నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా తమ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచే ప్రయత్నం చేస్తూ ఇదే ఒరవడి ని కంటిన్యూ చేస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More