శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణం లో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా ఏ.ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. పరిచవిశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి విస్మయ హీరో హీరోయిన్ల గా జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉన్న ఈ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో నిర్వహించారు. భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ లు అతిధులు గా పాల్గొని ప్రసంగించారు.సినిమాలోని పాత్రలు కష్టాలు పడుతుంటే.. చూసే ప్రేక్షకులకు ఫన్ వస్తుంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలను థియేటర్ తీసుకు రావడమే గొప్ప విషయం. యంగ్ టీం కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించారు.కథను నమ్మి సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు ఎప్పుడూ విజయం చేకూరాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని కోరారు..ఈ కార్యక్రమంలో రోమ్ భీమన ఆదిత్య రెడ్డి విశ్వంత్ దుద్దంపూడి నిర్మాత ప్రశాంత్ సంగీత దర్శకుడు క్రాంతి ఆచార్య అనురూప్ హీరోయిన్ విస్మయ శ్రీ తదితరులు ప్రసంగించారు.
previous post