Vaisaakhi – Pakka Infotainment

ట్రెండింగ్ లో కేకే సర్వే డ్

సంచలనం గా మారిన ఫలితాల వెల్లడి లో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా వినిపిస్తున్న ఒకే ఒక పేరు కేకే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా కేకే సర్వే మారి హిస్టరీ ని క్రియేట్ చేస్తోంది..జూన్ 1న వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో ఎగ్జాక్ట్ పోల్స్ గాకూటమి సునామీని ఊహించి ఏపీలో కేకే సర్వే కేకపుట్టించింది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసింది. ఇక ఈ సర్వే చూసి అటు వైసీపీ నాయకులు.. అసలు ఈ సర్వే ఎక్కడిది.? ఎవరు నమ్మలేరని.? అని అంటూ విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. ఆ సర్వే అంచనాలు నిజమయ్యేయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి ఉన్న ట్రెండ్స్ బట్టి వైసీపీ 10స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కూటమి 165 స్థానాల్లో ఆధిక్యతను చూపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన గురించే సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. గూగుల్ లో ఈరోజు కేకే పేరు ట్రేండింగ్ లో ఉంది ఎవరీ కేకే అని ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేసినట్టు తెలుస్తోంది. మీమ్స్ , కామెంట్స్ రూపంలో కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు. కొందరు వైసీపీ వస్తుందని అంచనా వేస్తుంటే.. ఇంకొందరు టీడీపీ కూటమి వస్తుందని అంచనా వేశారు. కానీ కేకే సర్వే ఒక్కడే ఏపీలో కూటమి సునామీని ఊహించారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.కేకే సర్వే అంచనా ఇదే..టీడీపీకి 144 స్థానాలలో 133 స్థానాలు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే జనసేన 21 స్థానాల్లో 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. పది స్థానాలకు గానూ ఏడు స్థానాలు బీజేపీ గెలుపొందుతుందని కేకే సర్వే చెప్పింది. అటు వైసీపీ 175 స్థానాలలో కేవలం 14 సీట్లు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More