ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను బిఎల్ ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద దర్శకత్వ శాఖ లో వర్క్ చేసిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.. ప్రస్తుతం “పేషన్” మూవీ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్ లోని కొన్ని పాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. రెండో షెడ్యూల్ కు మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగాదర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ – హైదరాబాద్ లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజులపాటు సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాలని చిత్రించాం. ఇప్పుడు రెండవ షెడ్యూల్ కి సిధ్ధమవుతున్నాం. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి ఇంతకుముందు ఎపుడూ రానటువంటి ఒక సమగ్రమైన, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ తరహాలో వస్తున్న మొట్టమొదటి భారతీయ సినిమా “పేషన్” అని చెప్పుకోవచ్చు. ప్రేమ, ఆకర్షణకి సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి ఈ సినిమా సమాధానం అవుతుంది. అన్నారు
previous post
next post