ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు….
previous post
next post