‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ’ అంటూ దేశవ్యాప్తంగా ఊపు ఊపేస్తున్నపుష్పరాజ్..అస్సలు తగ్గేదే లే’ అంటే ప్రపంచమే షేకయింది.పుష్ప రాజ్ జాతీయ అవార్డు అందుకుంటే అందరూ అవాక్కయ్యారు.. ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు ‘పుష్ప 2: ది రూల్’ తీసుకొచ్చేందుకు పగలు రాత్రి తేడా లేకుండా వర్క్ లో బిజీ గా ఉన్న దర్శకుడు సుకుమార్ తన సొంత ఊరు అయినా మలికిపురం మండలంలోని మట్టపర్రు గ్రామానికి విచ్చేసారు..కుటుంబంలోని కార్యక్రమంలో పాల్గొనడానికి సొంత ఊరుకు వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.సుకుమార్ రాకతో ఆయన ఇంటిదగ్గర సందడి వాతావరణం నెలకొంది..సుకుమార్ తో అభిమానులు, స్థానిక యువత సెల్ఫీ లు దిగి అభిమానాన్ని చాటుకున్నారు.. గ్రామస్థులతో సుకుమార్ ఆత్మీయం గా మాట్లాడారు వారంతా పుష్ప2 ఘనవిజయం సాధించాలని ఆకాక్షించారు.
previous post
next post