Vaisaakhi – Pakka Infotainment

సజ్జల మార్గదర్శకాలు దేనికి సంకేతం…?

వైఎస్సార్సీపీ కౌంటింగ్‌ రోజున అక్రమాల మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.. వైఎస్సార్సీపీ నాయకుల వద్ద ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. రూల్‌ కాదని వెనెక్కి తగ్గేవారు తమ కౌంటింగ్‌ ఏజెంట్‌గా వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్లకు కొన్ని మార్గదర్శాకాలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. అందులో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మన టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. వారనుకున్నట్లుగా అడ్డం కొట్టకుండా ఆపేందుకు ఏమేం రూల్‌ పొజిషన్‌ ఉన్నాయో చూసుకోవాలని సజ్జలు వ్యాఖ్యానించారు. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏమేం చేయాలనేది చూసుకోవాలి. అంతే తప్ప రూల్‌ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామని మనం కూర్చోవట్లేదని వెల్లడించారు. మనకు అనుకూలంగా అవతలి వాడి ఆటలు సాగకుండా రూల్‌ని ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్‌ చేయాలనేది నేర్చుకుందామని తెలిపారు. ఇందులో కౌంటింగ్‌ ఏజెంట్‌ తన వంతు పాత్ర పోషించేటట్లు వారి మెదడులోకి మీరు బాగా ఎక్కించాలని చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్లనుద్ధేశించి సజ్జలు అన్నారు.పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్‌ కాదేమో అని వెనక్కు తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దని పునరుద్ఘాటించారు. అవతల మన ప్రత్యర్థి ధర్మయుద్ధం చేసేవారు కాదు. వారికి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది ఈసీ రూపంలో కావచ్చు ఇంకోటి కావచ్చు గమనిస్తూనే ఉన్నామని శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి ఆటలు సాగనివ్వకుండా ఎలా చేయాలనేదే మన టార్గెట్‌. మళ్లీ బ్రహ్మాండంగా అధికాంలోకి వస్తున్నామని తెలిపారు. తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదని నేతలకు హమి ఇచ్చారు. అయితే అవతలివారి ఆటలను సాగనిచ్చి, వాళ్లు మానసికంగా పెట్టే ప్రచారానికి మనం బెంబేలెత్తకుండా ముందుగానే వారి ఆటలు సాగకుండా చేసేందుకు మరింత అప్రమత్తంగా ఉంటున్నామని సజ్జల వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More