ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వెడ్డింగ్ ను పురస్కరించుకొని విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఒక అరుదైన బహుమతిని వారికి సిద్ధం చేశారు చిరుధాన్యాలతో అనంత్ అంబానీ, రాధిస్ల చిత్రపటాన్ని తయారు చేశారు. దాదాపు పది రోజులు శ్రమించి మిల్లెట్స్ తో తీర్చిదిద్దిన చిత్రపటాన్ని అనంత్ అంబానీ కి పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల భారత్ లో జరిగిన వీరి తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేకమంది అతిధులు పాల్గొనడం, ప్రపంచవ్యాప్తంగా దీనిని కోట్లాది మంది వీక్షించడం జరిగింది. అది చూసిన విజయ్ కుమార్ తనదైన శైలిలో ఒక బహుమతి సిద్ధం చేయాలని ఆలోచన చేసి ఆదిశగా భారీ చిత్రపటాన్ని తయారు చేశారు.
previous post
next post