ఈ నెల 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న భజే వాయువేగం చిత్ర ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు “భజే వాయు వేగం” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సరికొత్త ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా “భజే వాయు వేగం” సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ట్రైలర్ తో మరింత హైప్ పెరుగుతుందని చిత్రబృందం ఆశిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
previous post
next post